మీ లక్ష్యాన్ని సాధించాలంటే.. ఈ 5 నియమాలు తప్పనిసరి పాటించాల్సిందే..!!

మీ లక్ష్యాన్ని సాధించాలంటే.. ఈ 5 నియమాలు తప్పనిసరి పాటించాల్సిందే..!!

by Sunku Sravan

Ads

ప్రతి ఒక్కరి జీవితంలో లక్ష్యం అనేది లేకపోతే లైఫ్ లో అనుకున్నదే సాధించలేము. ఖుషి,పట్టుదల,కార్యదీక్షత ఈ మూడు నియమాలతో పాటు గా మన లక్ష్యం నెరవేరాలంటే ఐదు నియమాలు తప్పనిసరిగా పాటిస్తే అనుకున్నది సాధించి జీవితం సాఫీగా ముందుకు వెళుతుంది. అవేంటో చూద్దామా..!!

Video Advertisement

గర్వం: మీరు ఏదైనా కష్టపడి సాధిస్తే అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మెచ్చుకున్నారని మీకు గర్వం పెరగ కూడదు.ఎదుటివారి మీద మీరు గర్వం చూపించకూడదు. ఇలా ఉండటం కన్నా అందరితో ప్రేమగా ఉండడం మంచిది. ఇగో లేని నిర్ణయాలు తీసుకోవాలి. మీరు మీ పక్క వారితో ఎలా ఉంటారో అనే దానిమీద మీ ఫ్యూచర్ నిర్ణయించబడి ఉంటుంది.

బాధపెట్టే రిలేషన్స్ కు దూరం: మిమ్మల్ని అర్థం చేసుకోకుండా బాధ పెట్టే రిలేషన్స్ కి దూరంగా ఉండండి. మీ కెరీర్ ని సరిగ్గా మలుచుకోవాలి.అంతేకానీ మీ దృష్టిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి వైపు మరల్చకండి.

 

హెల్దీ ఫుడ్: హెల్తీ గా ఉండడానికి ఫ్రూట్స్,వెజిటేబుల్స్, ఆకుకూరలు తినకుండా కడుపులోకి జంక్ ఫుడ్ ని డస్ట్ బిన్ లో వేసినట్టు వేస్తున్నాం. ఇలా తినడం వల్ల మన చేతులారా మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. తింటున్నప్పుడు బాగానే ఉంటుంది.కానీ రానురాను మీ ఆరోగ్యం నాశనం అవుతుంది. ఇలా జంక్ ఫుడ్ తినడం వల్ల నీరసం,ఆరోగ్య సమస్యలు వచ్చి మీ గోల్ ని రీచ్ కాలేకపోతారు.

సోషల్ మీడియాకు దూరం: ఫ్రీగా వచ్చే ఫేస్ బుక్,ఇంస్టాగ్రామ్ ఇలా చాలా ఆప్స్ మీ టైం ని నాశనం చేస్తున్నాయి. ఈ యాప్స్ ని మీకు అవసరం ఉన్నంతవరకే వాడుకోవాలి. మీకు పనికి వచ్చే వాటిలో టైం స్పెండ్ చేయాలి.మీ డ్రీమ్ ని ఎలా ఫుల్ ఫిల్ చేసుకోవాలో ఆలోచించాలి. అలా కాకుండా మీ టైం ని వేరే వాటి కోసం వేస్ట్ చేస్తే మీ లైఫ్ లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీ లైఫ్ లో అనవసరంగా చేసే పనులకు దూరంగా ఉండండి.

 

టైం వేస్ట్: టీవీ,లాప్ టాప్,మొబైల్ ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ మీ టైం ఎక్కువగా వేస్ట్ చేస్తున్నారని ఒక పరిశోధనలో తెలిసింది. మీ గోల్ ని రీచ్ అవ్వడానికి మీకు హెల్ప్ చేసే వాటిలో టైం స్పెండ్ చేయండి. అనవసరమైన వాటిలో టైం స్పెండ్ చేయకుండా మీ టైం ని సేవ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ లైఫ్ లో మీరు అనుకున్న గోల్ త్వరగా రీచ్ అవుతారు.


End of Article

You may also like