Ads
ఎన్నో మంచి మంచి చిత్రాల్లో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు నటుడు పృథ్వీ. తనదైన శైలిలో డైలాగ్ డెలివరీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు.
Video Advertisement
ఎన్నో చిత్రాల్లో నటించిన చిన్న చిన్న క్యారెక్టర్స్ తో కనిపించేవారు. ఖడ్గం చిత్రంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చెప్పిన డైలాగ్ తో ఒక్కసారి ఫేమస్ అయిపోయారు పృథ్వీ. ఈ చిత్రంతో మంచి గుర్తింపు సాధించి ఎన్నో అవకాశాలను చేజిక్కించుకున్నారు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పృద్వి తన కుమార్తె కూడా త్వరలో హీరోయిన్ గా పరిచయం అవుతోంది అని మీడియాతో వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పృద్వి మాట్లాడుతూ, మా అమ్మాయి పేరు శ్రీలు. సినిమాల్లోని అనేక సన్నివేశాలు చూసి అనుకరిస్తూ ఉండేది. నటనపై మక్కువ తో శ్రద్ధగా యాక్టింగ్ మరియు డాన్స్ నేర్చుకుంది. మొదటిలో తను హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి మలేసియా వెళ్లి సెటిల్ అవ్వాలని అనుకుంది. తనకి నటన పై ఉన్న ఆసక్తి వలన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మా అమ్మాయిని చాలా గ్రాండ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కి పరిచయం చేద్దాం అనుకున్నాను. కానీ అది సాధ్యపడలేదు.
ఇప్పుడు కొత్త రంగుల ప్రపంచం చిత్రంతో మా అమ్మాయి కల నెరవేరింది. ఈ చిత్రంతో తనను హీరోయిన్గా పరిచయం అవుతోంది. నా స్నేహితుడు కుమారుడు క్రాంతి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కొత్త రంగుల ప్రపంచం చిత్రం శ్రీ పిఆర్ క్రియేషన్స్ పై తెరకెక్కుతోంది. మా అమ్మాయి, హీరో ప్రతిభను చూశాక నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాని తీయడానికి రెడీ అయిపోయారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాను తీస్తున్నారు. త్వరలోనే ఆయన వివరాలు తెలుపుతాను.
మన తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించినట్లు మా అమ్మాయిని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను అని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు పృథ్వీ.
End of Article