17 ఏళ్ల హీరోయిన్‌ ని పెళ్లి.. కట్ చేస్తే ఎన్నో ఘటనలు.. “టైగర్ ప్రభాకర్” నిజ జీవితంలోనూ విలనేనా..?

17 ఏళ్ల హీరోయిన్‌ ని పెళ్లి.. కట్ చేస్తే ఎన్నో ఘటనలు.. “టైగర్ ప్రభాకర్” నిజ జీవితంలోనూ విలనేనా..?

by kavitha

Ads

టైగర్ ప్రభాకర్ అంటే తెలుగు ఆడియెన్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ కన్నడ ప్రభాకర్ అంటే గుర్తుపడతారు. ముఖ్యంగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మూవీ గుర్తొస్తుంది. చిరంజీవి, శ్రీదేవి నటించిన ఈ సినిమాలో టైగర్ ప్రభాకర్ విలన్ గా నటించారు.

Video Advertisement

80-90ల మధ్య కాలంలో దక్షిణాదిలో అనేక హిట్ సినిమాలలో విలన్ గా నటించి మెప్పించాడు. ఆయన సుమారు 450 చిత్రాల్లో నటించారు. టైగర్ ప్రభాకర్ మార్చి 25న 2001లో మరణించారు. కాగా

ఈమధ్యకాలంలో ఆయన మూడవ భార్య అయిన అంజు ఆయన గురించి సంచలన వాఖ్యలు చేశారు. ఆమె తన కన్నా 31 సంవత్సరాలు పెద్దవాడైన కన్నడ ప్రభాకర్ ను ప్రేమించి పెద్దలను ఎదురించి చేసుకుంది. అయితే వారి పెళ్లి జరిగిన ఏడాదికే ప్రభాకర్ ను వదిలి వెళ్ళింది. దానికి గల కారణాలను అంజు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అంజు బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత కాలంలో హీరోయిన్ గా చాలా సినిమాలలో నటించి ఆకట్టుకుంది. అయితే పదిహేడు ఏళ్ల వయసులో ఆమె వేసిన ఒక తప్పటడుగు అంజు లైఫ్ ని మార్చేసింది. అంజు వైవాహిక జీవితం గురించి ఇలా చెప్పుకొచ్చింది. బాలనటిగా, హీరోయిన్ గా 150కి పైగా చిత్రాలలో నటించాను. ఎన్నో చిత్రాల్లో నటించిన నాకు ‘రేంజర్’ అనే కన్నడ చిత్రంలో ఛాన్స్ వచ్చింది.  ఆ సినిమాతోనే కన్నడ ప్రభాకర్  పరిచయం అయ్యారు. ఆ సమయంలో నాకు 17 ఏళ్లు.
ప్రభాకర్ నన్ను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నట్లు నాతో చెప్పాడు. దాని గురించి నా తల్లిదండ్రులకు చెప్పాను. వాళ్లు అంగీకరించలేదు. అప్పుడు అతని కోసం ఇల్లు విడిచి వెళ్ళాను. ప్రభాకర్ ను ఎంతగానో నమ్మాను. ఇద్దరం  ఏడాది కలిసి ఉన్నాము. అతనికి అప్పటికే 2 పెళ్లిల్లు అయ్యి, పిల్లలు కూడా ఉన్నట్టు తెలిసింది.ఆ సమయంలో నేను ప్రెగ్నెంట్. తన గురించి అన్ని తెలిసి అడిగినందుకు చెడ్డదాన్ని అయ్యాను. ఇక ప్రభాకర్ తో  ఉండలేక బయటకు వచ్చేశాను. నా బంగారం కూడా అక్కడే వదిలి వచ్చాను. వచ్చేటప్పుడు ప్రభాకర్ తో ఒకటి చెప్పాను. నన్ను చాలా చెడుగా చూపించావు. నువ్వు చనిపోయిన కూడా  నిన్ను చూడను అని వచ్చాను. ఆయన చనిపోయినా కూడా  వెళ్లలేదని అంజు చెప్పుకొచ్చారు.
Also Read: టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ సినిమా రాబోతుందా.. ఈ క్రేజీ కాంబో వర్కౌట్ అయితే మరో సూపర్ హిట్..


End of Article

You may also like