సలార్ సినిమాలో నటించిన ఈ “బాబీ సింహా” ఎవరు..? ఇతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

సలార్ సినిమాలో నటించిన ఈ “బాబీ సింహా” ఎవరు..? ఇతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by kavitha

బాబీ సింహా తమిళ ఇండస్ట్రీలో టాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు ఉంది. తెలుగువాడు అయిన బాబీ సింహా కోలీవుడ్ లో నటుడుగా రాణిస్తూ, పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగు, మలయాళ సినిమాలలో కూడా అడపాదడపా నటిస్తూ, ఆ భాషలలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Video Advertisement

లేటెస్ట్ గా బాబీ సింహా సలార్ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సలార్ మూవీలో రాజమన్నార్ అల్లుడిగా, రాధా రామ భర్తగా కీలక పాత్రలో బాబీ సింహా నటించారు. బాబీ సింహా బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బాబీ సింహా అసలు పేరు జయసింహ. 1983లో హైదరాబాద్‌లోని మౌలాలీలో నవంబర్ 6న బాబీ సింహా జన్మించారు. వారి కుటుంబం ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, మోపిదేవికి చెందినవారు. 1995లో కొడైకెనాల్‌కు వెళ్లిపోయారు.  నాలుగో తరగతి వరకు మౌలాలీలో,  ఆ తరవాత టెన్త్ క్లాస్ వరకు కృష్ణా జిల్లా మోపిదేవిలోని ప్రియదర్శిని విద్యాలయం తెలుగు మీడియం పాఠశాలలో పూర్తి చేసారు. ఆ తరువాత కోయంబత్తూర్‌లోని పయనీర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో చదువు పూర్తి చేశాడు.
2005లో, కోయంబత్తూర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనగా, అక్కడికి ముఖ్య అతిధులు వచ్చిన సుందర్ సి, ఇ. రాందాస్ కోలీవుడ్ లో నటుడిగా ట్రై చేయమని సూచించారు. సింహా డిగ్రీని పూర్తి చేసి, యాక్టర్ గా అవకాశాల కోసం చెన్నైకి వెళ్ళాడు. తన ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మార్కెటింగ్, బీమా మరియు బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్‌లో పని చేస్తుండేవాడు. బాబీ సింహా నటించిన తొలి సినిమా మాయ కన్నడి 2007 లో గుర్తింపు లేని పాత్రలో కనిపించాడు.
మొదట్లో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఆ తరువాత పిజ్జా, నేరమ్‌, సూదు కవ్వమ్‌ వంటి తమిళ సినిమాలలో నటించారు. జిగర్తాండ మూవీతో మంచి గుర్తింపు లభించింది. అతని పాత్రకు విమర్శకుల ప్రశంసలను పొందింది. ఆ మూవీకి గాను బాబీ సింహాకు జాతీయ ఉత్తమ సహాయ నటుడి అవార్డు వచ్చింది. ఈ పాత్రలో  టాలీవుడ్ లో ‘గద్దలకొండ గణేష్’ మూవీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించారు. జిగర్తాండ మూవీ తరువాత వరుస సినిమాలలో నటిస్తూ, రాణిస్తున్నారు.

Also Read: సలార్ మూవీలో ఈ మిస్టేక్ గమనించారా..? చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ..?

 


You may also like

Leave a Comment