సినిమా అనేది ఒక కల్పిత ప్రపంచం. అందులో చాలా వింతలు జరుగుతూ ఉంటాయి. ఒక సినిమాలో హీరో పక్కన భార్యగా నటించిన నటీమణులు, మరో చిత్రంలో చెల్లెలిగానో.. లేదా మరో పాత్రలోనో కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు మనం చాలా సార్లే చూసాం. పాత్ర డిమాండ్ ని బట్టి నటీనటులు నటించాలి.

Video Advertisement

ఎక్కడైనా రాణించాలి అంటే ప్రొఫెషనాలిటీ చాలా ముఖ్యం. మనతో పాటు ఎవరెవరున్నారు. మనం ఎవరితో కలిసి పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. మన పని మనం బాగా చేయాలి అనేదే ముఖ్యం. అలాగే మంచి సినిమాలు ఎన్నుకోవడంలో నాని ఎప్పుడూ ముందుంటారు అని మనకి తెల్సిందే. పక్కింటి అబ్బాయిల ఉండే నానికి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ఆరంభించి.. అనుకోకుండా హీరోగా మారాడు ఈ హీరో. విలక్షణమైన నటనతోపాటు.. విభిన్న సినిమాలను చేయడం నాని స్టైల్.

the actress who acted as mother and sister to nani..

 

అయితే నానికి ఒక నటి పలు సినిమాల్లో తల్లిగా, అక్కగా నటించారు. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా నటి రోహిణి. చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించిన రోహిణి.. తమిళ, మలయాళ చిత్రాల్లో తక్కువ సమయం లోనే టాప్ హీరోయిన్ గా మారారు. పలు చిత్రాలకు డబ్బింగ్ కూడా చెప్పారు రోహిణి. రచయితగా లిరిక్స్, స్క్రీన్ రైటింగ్ లోనూ ఆమె రాణించారు. ఇంకా మోడల్ గా, యాంకర్ గా కూడా మెప్పించారు రోహిణి.

the actress who acted as mother and sister to nani..

ఇక హీరో నాని, రోహిణి చాల చిత్రాల్లో కలిసి నటించారు. నాని కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన అలా మొదలైంది చిత్రం తో మొదలు..జెంటిల్ మాన్, అంటే సుందరానికి చిత్రాల్లో రోహిణి నానికి తల్లిగా నటించారు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వం లో వచ్చిన ‘టక్ జగదీశ్’ చిత్రం లో రోహిణి నానికి అక్కగా నటించారు. ఇలా ఏ పాత్రల్లో కనిపించినా ప్రేక్షకులు వీరి కాంబినేషన్ ని ఆదరించారు.