ఇటీవల బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సినిమాలలో ‘దసరా’ ఒకటి.  నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన ఈ మాస్ యాక్షన్ చిత్రం మార్చి 30న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Video Advertisement

మొదటి షోతో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ 10 రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసి, హీరో నాని కెరిర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. తొలి సినిమాతోనే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసలు పొందారు. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీతో నాని మరో మెట్టు ఎక్కాడు.
ఈ చిత్రంలో హీరో నాని ఇంతకు ముందు కనిపించనంత మాస్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ధరణిగా చాలా సహజంగా నటించాడు. నాని కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిస్తుంది. అంటేకాకుండా ఈ మూవీతో నాని మాస్ ఇమేజ్ పొందాడు. హీరోయిన్ కీర్తిసురేష్ వెన్నెల క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి ఫ్రెండ్ కోసం ప్రాణం పెట్టే క్యారెక్టర్ లో బాగా నటించాడు. సముద్ర ఖని, సాయి కుమార్, సోనియా చౌదరి ఇతర పాత్రలు పోషించారు.
సోనియా చౌదరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఈమె గతంలో యాంకర్ గా కూడా చేశారు. ఈమె ఇప్పటి వరకు చాలా చిత్రాలలో నటించింది. అయితే ఆ పాత్రలు ఒకటి లేదా రెండు డైలాగులు మాత్రం చెప్పి వెళ్లిపోయే క్యారెక్టర్స్. ఈ ఏడాది రిలీజ్ అయిన బాలకృష్ణ  వీరసింహారెడ్డి సినిమాలో కూడా సోనియా చౌదరి కనిపించింది. కానీ ఆ క్యారెక్టర్ కు మాటలు ఉండవు. దాంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే దసరా సినిమాలో సోనియాక కొంచెం గుర్తింపు ఉన్న క్యారెక్టర్ లో నటించింది.
ఈ చిత్రంలో పద్మ అనే పాత్రలో సోనియా చౌదరి చక్కగా నటించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోనియాకూడా డీ గ్లామరస్ గా చూపించాడు. అయినా ఈమె చేసిన పద్మ పాత్ర క్లిక్ అయ్యింది. గుర్తింపు ఉన్న పాత్రలు మరో రెండు చేస్తే సోనియా చౌదరి నటిగా బిజీ అయిపోతుంది.

Also Read: గూఢచారి నం-1 లో “చిరంజీవి” నుండి… ఏజెంట్ లో “అఖిల్ అక్కినేని” వరకు… సినిమాల్లో “సీక్రెట్ ఏజెంట్” పాత్ర పోషించిన 15 హీరోలు..!