సినిమా కథల విషయానికి వస్తే ఎప్పటికి బోర్ కొట్టని జోనర్ స్పై థ్రిల్లర్ మూవీస్. వాటికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సరైన స్టోరీ స్క్రీన్ ప్లే ఉంటే ఈ జోనర్ తో అద్భుతాలు చెయ్యొచ్చు.
Video Advertisement
అందుకే ప్రస్తుతం తెలుగు హీరోలు సహా సౌత్ ఇండస్ట్రీ హీరోలు స్పై ఏజెంట్ పాత్రల్లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పుడు తెలుగు చిత్రాల్లో సీక్రెట్ ఏజెంట్ పాత్రల్లో అలరించిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
#1 గూఢచారి
అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ మూవీ కూడా జేమ్స్ బాండ్ తరహా సినిమానే.ఈ మూవీలో అడివి శేష్..సీక్రెట్ ఏజెంట్ పాత్రలో మెప్పించారు. ఇపుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ను తెరకెక్కించనున్నారు.
#2 స్పైడర్
మహేశ్ కూడా…మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ‘స్పైడర్’ మూవీలో సీక్రెట్ ఏజెంట్ తరహా పాత్రలో నటించారు.
#3 పైసా వసూల్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘పైసావసూల్’ మూవీలో ‘రా’ ఏజెంట్ పాత్రను పోషించారు బాలయ్య.
#4 గూఢచారి నెం. 1
మెగాస్టార్ చిరంజీవి కూడా ‘గూఢచారి నెం.1, ‘రుద్రనేత్ర’ వంటి సినిమాల్లో భారత గూఢచారి పాత్రలో మెప్పించారు.
#5 శక్తి
ఎన్టీఆర్ కూడా ‘శక్తి’ సినిమాలో జేమ్స్‌బాండ్ తరహా సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించాడు.
#6 గరుడ వేగ
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో వచ్చిన ‘గరుడ వేగ’ మూవీలో రాజశేఖర్ జేమ్స్ బాండ్ తరహా సీక్రెట్ ఏజంట్ పాత్రలో నటించారు. ఈ మూవీతో రాజశేఖర్ హీరోగా తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.
#7 ధృవనచ్చత్రం
గౌతమ్ మీనన్ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం లో విక్రమ్ సీక్రెట్ ఏజంట్ పాత్రనే చేసాడు.
#8 చాణక్య
‘చాణక్య’సినిమాలో జేమ్స్ బాండ్ తరహా ‘స్పై’ క్యారెక్టర్‌లో అలరించారు గోపీచంద్. ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చినా స్పై క్యారెక్టర్‌లో గోపీచంద్ నటన ఆకట్టుకునే విధంగా ఉంది.
#9 ప్రాజెక్ట్ కే
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రానున్న ప్రాజెక్ట్ కే మూవీ లో కూడా ప్రభాస్ జేమ్స్ బాండ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సీక్రెట్ ఏజెంట్ తరహాలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
#10 ఏజెంట్
అక్కినేని అఖిల్ ఇపుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో అఖిల్ జేమ్స్ బాండ్ తరహా స్పై క్యారెక్టర్‌లో కనిపించున్నాడు.
#11 డెవిల్
నందమూరి కళ్యాణ్ రామ్ స్వాతంత్య్రపు పూర్వపు స్టోరీతో చరిత్రలో మరుగున పడిన ఒక సీక్రెట్ ఏజెంట్ జీవిత కథ లో నటిస్తున్నారు.
#12 ది ఘోస్ట్
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో నటించిన ది ఘోస్ట్ మూవీ లో ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించారు కింగ్ నాగ్.
#13 విశ్వరూపం
‘విశ్వరూపం’ సినిమాలో కమల్…భారత్ జేమ్స్‌బాండ్ గా ఏ రకంగా నట విశ్వరూపం చూపించాడో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. 60 యేళ్ల పై పడ్డ వయసులో కమల్ ఈ మూవీ కోసం చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెప్పించాయి.
#14 బీస్ట్
తమిళ స్టార్ హీరో విజయ్ బీస్ట్ మూవీ లో ‘రా’ ఏజెంట్ పాత్రలో నటించారు.
#15 స్పై
కార్తికేయ 2 మూవీ తో దేశవ్యాప్తం గా పాపులారిటీ ని పెంచుకున్న నిఖిల్ తన తదుపరి చిత్రాన్ని స్పై జోనర్ లో చేయనున్నాడు.