టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్‌లలో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కూడా ఒకటి. ఇప్పటి వరకు బాలకృష్ణ, బోయపాటి కాంబోలో మూడు చిత్రాలు వచ్చాయి. సింహ, లెజెండ్, అఖండ, ఒక మూవీని మించి మరో మూవీ అలా మూడు సినిమాలు భారీ కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి.
Video Advertisement
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన రెండవ మూవీ లెజెండ్. ఈ మూవీతో ఒకప్పటి ఫ్యామిలీ హీరో జగపతి బాబు సరికొత్త విలన్ గా రీఎంట్రీ ఇచ్చాడు. రాధిక ఆప్టే, సోనాలీ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు.
సింహా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ నటించిన మూవీ లెజెండ్. ఈ మూవీ 2014 లో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పై ఆచంట గోపిచంద్, ఆచంట రామ్, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. కొర్రపాటి సాయి సమర్పించారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీకి త్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో నాంది అవార్డ్ వచ్చింది.
ఈ రెండు సినిమాలలో ఆనంద్ రాజ్ అనే యాక్టర్ నటించాడు. సింహా సినిమాలో కాలేజీ స్టూడెంట్ గా నటించాడు. ఈ నటుడి పేరు ఆనంద్ రామరాజు. ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, అమలాపురంలో జన్మించారు. తన బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని అక్కడే పూర్తి చేశాడు. నటన పై విపరీతమైన ఆసక్తి ఉన్న రామరాజు 2003లో సత్యానంద్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి నటనలో శిక్షణ పొందారు.
ఆనంద్ రామరాజు 2004 లో ఆరుగురు పతివ్రతలు అనే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు రు. ఈ మూవీకి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఆ తరువాత గౌతమ్ SSC, పోకిరి, సింహా, నేనింతే, లెజెండ్, లౌక్యం, ఆగడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలలో నటించాడు. ఎక్కువగా నెగిటివ్ రోల్స్‌లో నటించిన రామరాజు తన నటనకు గాను ప్రశంసలు అందుకున్నాడు.
Also Read: “కుమారి శ్రీమతి” ట్రైలర్‌లో.. “నిత్యా మీనన్, గౌతమి” తో పాటు కనిపించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?