ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ఆర్య. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో వారి కలయికలో రెండవ చిత్రంగా ‘ఆర్య 2’ తెరకెక్కింది. ఈ మూవీ యావరేజి గా నిలిచినప్పటికీ, ఈ సినిమాలోని  పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి.

Video Advertisement

ఇక ఈ మూవీ సాంగ్స్ లో అల్లు అర్జున్ డ్యాన్స్ కి పాన్ ఇండియా స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నుండే ఇతర భాషల ప్రేక్షకులు కూడా అల్లు అర్జున్ నటించిన చిత్రాలను చూడడం మొదలుపెట్టారు. ఈ మూవీలో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా నటించిన నవదీప్ చిన్నప్పటి క్యారక్టర్ లో నటించిన అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడో చూద్దాం..
అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, జంటగా నటించిన ఆర్య 2 మూవీలో నవదీప్, బ్రహ్మానందం, శ్రద్ధా దాస్ కీలక పాత్రలలో నటించారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని  సమకూర్చారు. ఈ మూవీలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కమర్షియల్ గా హిట్ కాకపోయినా ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ ఫ్రెండ్ పాత్రలో నవదీప్ నటించారు.
నవదీప్ చిన్నప్పటి పాత్రలో నటించిన బాల నటుడి పేరు అనుదీప్. పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ అబ్బాయి ఇప్పుడు పెద్దగా అయ్యాడు. అనుదీప్ నటుడిగా కొనసాగుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన బ్రో మూవీలో అనుదీప్ నటించాడు. ఈ మూవీ ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే.
బ్రో మూవీలో సాయి ధరమ్ తేజ్ చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకునే యువకుడిగా, తనికెళ్ళ భరణి కుమారుడిగా నటించిన అబ్బాయి అనుదీప్. సినిమా చివరిలో ఆ అబ్బాయి నిజస్వరూపం బయటపడడంతో సాయి ధరమ్ తేజ్ చేతిలో దెబ్బలు తినే పాత్రలో నటించాడు. పెద్దయ్యాక అనుదీప్ నటించిన తొలి మూవీ ఇదే.

Also Read: “ఇలాంటి సీన్ ఎలా పెట్టారు..?” అంటూ… “స్కంద” పై కామెంట్స్..!