“చంద్రముఖి 2” మూవీలో రజనీకాంత్ పోషించిన రాజు పాత్ర చేసిన ఈ యాక్టర్ ఎవరో తెలుసా..?

“చంద్రముఖి 2” మూవీలో రజనీకాంత్ పోషించిన రాజు పాత్ర చేసిన ఈ యాక్టర్ ఎవరో తెలుసా..?

by kavitha

Ads

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చంద్రముఖి ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అలాంటి హిట్ మూవీకి సీక్వెల్‌ గా చంద్రముఖి 2 తెరకెక్కింది. ఈ మూవీని ప్రకటించినప్పటి నుండి చంద్రముఖి 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Video Advertisement

భారీ అంచనాల మధ్య తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీలో రాఘవ లారెన్స్‌ నటించగా, బాలీవుడ్‌ టాప్ హీరోయిన్ కంగన రనౌత్ చంద్రముఖిగా నటించింది. అయితే రజనీకాంత్‌ పోషించిన రాజు పాత్రలో ఈ సినిమాలో నటించిన యాక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
17 సంవత్సరాల క్రితం తెలుగు, తమిళ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న మూవీ చంద్రముఖి. ఈ మూవీ ఆ తర్వాత అనేక భాషలలో రీమేక్ అయింది. అయితే ఇన్నేళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ తీశారు డైరెక్టర్ పి వాసు. చంద్రముఖి 2 గా తెరకెక్కిన ఈ సీక్వెల్ లో రజినీకాంత్ పాత్రలో రాఘవ లారెన్స్ నటించారు. ఇక రజినికాంత్ పోషించిన రాజు పాత్రలో నటుడు శత్రు నటించారు.
శత్రు స్క్రీన్ నేమ్, అసలు పేరు ఎం రామకృష్ణ. శత్రు ఒడిశాలోని బార్‌ఘర్ జిల్లాలో సర్లా గ్రామంలో 1984లో తెలుగు మాట్లాడే కుటుంబంలో ఆగస్టు 6న జన్మించారు.రావెన్‌షా విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీలో డిగ్రీని చేశాడు. రామకృష్ణ నటన పై ఉన్న ఆసక్తితో హైదరాబాద్‌కు వెళ్లారు. 2010లో శేఖర్ కమ్ముల తీసిన లీడర్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ తరువాత పలు సినిమాలలో చిన్న, చిన్న పాత్రలలో నటించాడు. 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మూవీలో హీరోయిన్ అన్నయ్య రామరాజు పాత్రలో నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
మిస్టర్, రంగస్థలం, బాహుబలి 2 లో పిండారీ గిరిజన నాయకుడుగా, అల్లు అర్జున్ హీరోగా నటించిన’పుష్ప – ది రైజ్’లో టాస్క్‌ఫోర్స్ డిఎస్పీ గోబిందప్పగా, సీతారామం మూవీలో లెఫ్టినెంట్ వికాస్ గా నటించాడు. 2022 లో వచ్చిన కొరమీను అనే మూవీలో ఐపీఎస్ ఆఫీసర్ మీసాల రాజుగా కీలక పాత్రలో నటించాడు. టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించడమే కాకుండా, తమిళంలోను కొన్ని సినిమాలలో నటించి, గుర్తింపు పొందాడు. ఆ క్రమంలోనే లేటెస్ట్ గా రిలీజ్ అయిన చంద్రముఖి 2 లో వేటయ్య రాజు పాత్రలో నటించాడు.

https://www.instagram.com/p/CYCNpEjM5nm/

Also Read: హీరో అవుతాడనుకున్న ఆ యాక్టర్ కొడుకు.. మంచానికే పరిమితం అయ్యాడు..! అసలు ఏం జరిగిందంటే..?


End of Article

You may also like