సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ జైలర్. ఈ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ రూ. 620 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో జైలర్ మూవీ  ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

Video Advertisement

రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు మరియు రజినీకాంత్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. దాంతో ఈ మూవీ పలు రీకార్డులను బ్రేక్ చేసి, సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ కథను ముందుగా టాలీవుడ్ టాప్ హీరోకు వినిపించారంట. కానీ ఆయన రిజెక్ట్ చేసారంట. ఆ తెలుగు హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
jailer movie copied from a hollywood movieసూపర్ స్టార్ రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, ప్రధాన పాత్రలలో నటించిన సినిమా జైలర్. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఆగస్టు 10న విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ కలెక్షన్స్ రాబట్టింది. రజినీకాంత్ కెరీర్‌లో ఎన్నో చిత్రాలలో నటించారు. అయితే జైలర్‌లో రజనీకాంత్ హీరోగా కాకుండా తండ్రి పాత్రలో నటించి ఆశ్చర్యపరిచారు.
ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్,  మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ అతిథి పాత్రలో నటించి, మెప్పించారు. అయితే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని తెలుగు టాప్ హీరోతో తెరకెక్కించాలని అనుకున్నారట. ఆ హీరో మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి.
నెల్సన్ బీస్ట్ మూవీ సమయంలో మెగాస్టార్‌ చిరంజీవికి జైలర్ కథను చెప్పాడట. కథ చిరంజీవి బాగా నచ్చిందట. కానీ ఇటువంటి స్టోరీలో ఫ్యాన్స్ తనను చూడగలరా? రీ ఎంట్రీ నుండి కమర్షియల్ చిత్రాలే చేస్తున్నాను. ఈ టైమ్ లో ఇటువంటి  స్టోరీతో రిస్క్ అని జైలర్ మూవీ చెయ్యడానికి నిరాకరించారంట. ఆ తరువాత నెల్సన్ ఈ స్టోరీని రజినీకాంత్ ని చెప్పడం, ఆయనకీ బాగా నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారు. జైలర్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి, అక్కడ కూడా రికార్డులను క్రియేట్ చేస్తోంది.

Also Read: ఈ అమ్మాయి గురించి మన తెలుగు వాళ్లు తెగ వెతికేస్తున్నారు..! ఇంతకీ ఈమె ఎవరంటే..?