ప్రస్తుతం నెట్టింట కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలని చూసిన కొందరు ప్రభాస్ ఫాన్స్ ఆశ్చర్య పోతున్నారు. అసలు ఎవరీ వ్యక్తి..?? సేమ్ మన డార్లింగ్ ప్రభాస్ లాగ ఉన్నాడే అని షాక్ అవుతున్నారు. దీంతో అసలు ఈయన ఎవరు.. ఎక్కడివాడు.. ప్రభాస్ లా ఎందుకున్నాడు అంటూ నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేసారు ఫాన్స్.

Video Advertisement

 

ఇంతకీ తెలిసిందేంటంటే.. ఆ ఫొటోల్లోని వ్యక్తి పేరు ఆశిష్ కపూర్. ఆయన బాలీవుడ్ నటుడు. ఆయన పలు సూపర్ హిట్ హిందీ సీరియల్స్ లో నటించారు. అంతే కాకుండా ఆయన పలు సినిమాల్లో నటించారు. ఒక సినిమాకి ప్రొడ్యూసర్ గా కూడా చేసారు. ఆశిష్ కపూర్ సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా ఉంటారు. ఈయనకి ఫాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఆయన తన వర్క్ అవుట్ ఫోటోలు, ఇంకా పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

 

who is this actor just looks like prabhas..!!
దీంతో ఆయన ఫోటోలు చూసిన ప్రభాస్ ఫాన్స్ కొన్ని యాంగిల్స్ లో ఆయన ప్రభాస్ లా ఉన్నాడంటూ ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సాలార్, ఆది పురుష్ చిత్రాల్లో నటిస్తున్నారు. దాని తర్వాత ప్రాజెక్ట్ కె కూడా లైన్ లో ఉంది. వీటన్నిటిని ప్రభాస్ ఎప్పుడు పూర్తి చేస్తాడా అని ఫాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదు. ఆయన నటిస్తున్న అన్నీ సినిమాలు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల అవుతున్నాయి.

who is this actor just looks like prabhas..!!

తాజాగా ప్రభాస్ ఆహా ఓటీటీలో వస్తున్నా అన్ స్టాపబుల్ షోకి వచ్చారు. దీనికి హోస్ట్ గా బాలయ్య ఇరగదీస్తున్నాడు. ఈ షో లో ప్రభాస్, తన స్నేహితుడు గోపీచంద్ తో కలిసి పాల్గొన్నాడు. తాజాగా దీనికి సంబంధించిన గ్లిమ్ప్స్ కూడా విడుదల చేసారు. దీంతో ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరో వైపు బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ ఆశించినంత గా ఆడకపోవడం తో రానున్న చిత్రాల గురించి ప్రభాస్ ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.