సినిమాల్లో రాణించాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాల్సిందే. అయితే ఇక్కడ అంత త్వరగా అవకాశాలు లభించవు. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకొనేవారే రాణించగలుగుతారు. అలా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న నటుడే సుబ్బరాజు.

Video Advertisement

సుబ్బరాజు టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో 100కు పైగా సినిమాల్లో ఆయన నటించాడు. అన్ని రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన ఇట్టే ఒదిగిపోతారు. అయితే ఈయన యాక్సిడెంటల్‌గా ఇండస్ట్రీకి పరచయమయ్యాడు. సినిమాల్లోకి రాక ముందు సుబ్బరాజు ‘డెల్’ కంప్యూటర్స్ లో కంప్యూటర్ ఇంజనీర్ గా పని చేసాడు.

how actor subbaraju came into movies..!!

సుబ్బరాజు చిత్రసీమ ప్రవేశం చిత్రంగానే జరిగింది. ‘డెల్’లో పనిచేస్తున్న రోజుల్లో దర్శకుడు కృష్ణవంశీ అసిస్టెంట్ ఒకరు సుబ్బరాజు వద్దకు వచ్చి, తమ డైరెక్టర్ పర్సనల్ కంప్యూటర్ పాడయిందని, బాగు చేయమని కోరాడు. ఆ సమస్య సాల్వ్ చేసేందుకు అక్కడికి వెళ్లాడు సుబ్బరాజు. అక్కడ సుబ్బరాజును చూసిన కృష్ణవంశీ.. ఒడ్డూ పొడుగు బాగుండటంతో ఖడ్గం సినిమాలో చిన్న రోల్ ఇచ్చాడు. అలా తెలుగు సినిమాల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు సుబ్బరాజు.

how actor subbaraju came into movies..!!

ఆరంభంలో చిన్నాచితకా పాత్రలో సాగిన సుబ్బరాజుకు పూరి జగన్నాథ్ చిత్రాలు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ‘ఖడ్గం’ తర్వాత పూరి జగన్నాథ్ ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’లో హీరోతో బాక్సింగ్ రింగ్ లో తలపడే ప్రత్యర్థి పాత్ర పోషించారు. ఈ సినిమా సుబ్బరాజుకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది. వరుసగా “శ్రీ ఆంజనేయం, నేనున్నాను, ఆర్య, సాంబ” చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు.

how actor subbaraju came into movies..!!

తన దరికి చేరిన ప్రతీపాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు సుబ్బరాజు. అలా అతి త్వరగా 50 సినిమాలు పూర్తి చేశారు. దర్శకుడు పూరి జగన్నాథ్, రవితేజ తనను ఎంతో ప్రోత్సహించారు అని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

how actor subbaraju came into movies..!!

ప్రస్తుతం వరుస చిత్రాలతో సుబ్బరాజు కెరీర్‌లో దూసుకుపోతున్నారు. తనకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ తన పాత్రకి వంద శాతం న్యాయం చేసే విధంగా కష్టపడ్డానని అందువల్లనే ప్రస్తుతం వందకు పైగా చిత్రాలలో నటించానని చెప్పుకొచ్చాడు సుబ్బరాజు.