ఈ వ్యక్తి హీరోగా కూడా నటించారా..? ఈ పాటలో సంఘవితో ఉన్న నటుడు ఎవరో తెలుసా..?

ఈ వ్యక్తి హీరోగా కూడా నటించారా..? ఈ పాటలో సంఘవితో ఉన్న నటుడు ఎవరో తెలుసా..?

by Mohana Priya

Ads

కొంత మంది నటులు హీరోల పాత్రలు మాత్రమే చేస్తారు. లేదా హీరోయిన్ల పాత్రలు మాత్రమే చేస్తారు. కొంత మంది విలన్ పాత్రలు మాత్రమే చేస్తారు. కొంత మంది కేవలం సహాయ పాత్రలు మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ కొంత మంది నటులు ఉంటారు. ఎలాంటి పాత్ర అయినా సరే చేస్తారు. వాళ్లు ఏ పాత్ర చేసినా కూడా, ఆ పాత్ర వారి కోసం రాసినట్టు మాత్రమే ఉంటుంది. పాదరసంలాగా ఏ పాత్ర అంటే ఆ పాత్రలో ఒదిగిపోతారు. ఇదంతా చదువుతున్నప్పుడు అలాంటి నటుల ప్రస్తావన వస్తే గుర్తొచ్చే మొదటి నటులు ఈ వ్యక్తి. ఇతను ఇప్పుడు చాలా గొప్ప నటుడు అయ్యారు. అంతకుముందు హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించారు.

Video Advertisement

actor with sanghavi in this song

అందులో ఈ సినిమా కూడా ఒకటి. సంఘవి పక్కన ఉన్న నటుడు ఇప్పటివరకు ఎన్నో వందల అవార్డ్స్ గెలుచుకున్నారు. ఆ సినిమాలో ఆయన హీరో పాత్రలో నటించారు. ఆ నటుడు ప్రకాష్ రాజ్. తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, తాతగా, మామగా, భర్తగా, ఒక సినిమాలో హీరోగా, ఇంకొక సినిమాలో నెగిటివ్ పాత్రలో, అసలు ఆయన పోషించని పాత్ర లేదు. కాదు కాదు. ఆయన పోషించలేని పాత్ర లేదు. అందుకే, ఏ భాషలో అయినా సరే ప్రకాష్ రాజ్ నటిస్తారు. ప్రకాష్ రాజ్ లాంటి నటుడు తమ సినిమాల్లో కూడా నటిస్తే బాగుంటుంది అని మిగతా భాషల వారు కూడా అనుకుంటారు. ప్రకాష్ రాజ్ కన్నడ వారు. కానీ తెలుగు వారు ఆయనని తమ సొంత మనిషిలాగా చూసుకుంటారు.

తెలుగు వారు మాత్రమే కాదు. ఇతర రాష్ట్రానికి చెందిన ప్రజలు కూడా ప్రకాష్ రాజ్ ని తమ ప్రాంతానికి చెందిన నటుడిగా భావిస్తారు. అంత బాగా ప్రకాష్ రాజ్ వారి భాషలు మాట్లాడుతారు. భాషలు మాత్రమే కాదు. ఆ భాషల్లో ఆయన ఏదైనా ఒక పాత్ర పోషిస్తే, ఆ పాత్ర ఏదైనా ఒక ప్రాంతానికి చెందిన పాత్ర అని చూపిస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన యాసలో ఆ సినిమాలో మాట్లాడతారు ప్రకాష్ రాజ్. అంతఃపురంలో నటించిన ప్రకాష్ రాజ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన ప్రకాష్ రాజ్ ఒకరే అంటే నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు, పైన చెప్పిన సినిమా పేరు వీడు సామాన్యుడు కాదు.

actor with sanghavi in this song

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ హీరో పాత్రలో నటించారు. ఉప్పలపాటి నారాయణరావు, వెంకట్ మద్దిరాల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం మీద పత్స నాగరాజ, సి.వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాలో, ప్రకాష్ రాజ్ హీరోగా నటించగా, రాశి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. విద్యాసాగర్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాటలు అప్పట్లో చాలా పెద్ద హిట్ అయ్యాయి. కేవలం ఈ సినిమాలో మాత్రమే కాదు ఇంకా ఎన్నో సినిమాల్లో ప్రకాష్ రాజ్ హీరోగా నటించారు. ఇప్పుడు విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు.

ALSO READ : అల్లు అర్జున్ కి, ఆయన భార్య స్నేహారెడ్డికి మధ్య ఎన్ని సంవత్సరాల తేడా ఉందో తెలుసా..? స్నేహా ఎప్పుడు పుట్టారంటే..?


End of Article

You may also like