అల్లు అర్జున్ కి, ఆయన భార్య స్నేహారెడ్డికి మధ్య ఎన్ని సంవత్సరాల తేడా ఉందో తెలుసా..? స్నేహా ఎప్పుడు పుట్టారంటే..?

అల్లు అర్జున్ కి, ఆయన భార్య స్నేహారెడ్డికి మధ్య ఎన్ని సంవత్సరాల తేడా ఉందో తెలుసా..? స్నేహా ఎప్పుడు పుట్టారంటే..?

by Mohana Priya

Ads

ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ అంటే గుర్తొచ్చే వారిలో ముందుంటారు అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి. వీరిద్దరి పెళ్లి జరిగి దాదాపు 10 సంవత్సరాలు దాటింది. అల్లు అర్జున్ ఈ 10 సంవత్సరాల్లో స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా ఎదిగారు. ఇటీవల మేడం టుసాడ్స్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం కూడా ఆవిష్కరించారు. ఈ వేడుకకి అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు వెళ్లారు. అల్లు అర్జున్ తో పాటు ప్రతి ఈవెంట్ కి అల్లు స్నేహారెడ్డి హాజరు అవుతారు. అల్లు అర్జున్ సినిమాలు వస్తుంటే ఎంకరేజ్ చేయడంలో కూడా ముందు ఉంటారు. అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

Video Advertisement

కొన్ని ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు. కానీ, ఎక్కువ శాతం మాత్రం వారి పిల్లలకి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. అల్లు స్నేహారెడ్డికి ట్రావెలింగ్ అంటే ఇష్టం అని తన సోషల్ మీడియా ఎకౌంట్స్ చూస్తే తెలుస్తోంది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఒక పార్టీలో వీళ్ళిద్దరూ కలిసి, ఆ తర్వాత ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్ళింది. ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరికి మధ్య కొంత వయసు తేడా ఉంది. అల్లు అర్జున్ ఏప్రిల్ 8వ తేదీ, 1982లో పుట్టారు. అల్లు స్నేహారెడ్డి సెప్టెంబర్ 29వ తేదీ 1985లో పుట్టారు.

luxurious things owned by allu arjun

వీరిద్దరికీ దాదాపు 3 సంవత్సరాలు వయసు తేడా ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప రెండవ భాగం షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదల అవ్వకముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాని చాలా గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఎన్నో భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఈ సినిమా విడుదల అవుతుంది. అయితే ఈ సినిమాకి మూడవ భాగం కూడా ఉంది అని సమాచారం. అది ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే రెండవ భాగం విడుదల అయ్యాక క్లైమాక్స్ లో వాళ్ళు చేసే అనౌన్స్మెంట్ వరకు ఆగాల్సిందే.

ALSO READ : మెహర్ రమేష్ “రామ్ చరణ్” బర్త్ డే పోస్ట్ లో ఈ మిస్టేక్ చేశారా..? అసలు ఎందుకు డిలీట్ చేశారు..?


End of Article

You may also like