మెహర్ రమేష్ “రామ్ చరణ్” బర్త్ డే పోస్ట్ లో ఈ మిస్టేక్ చేశారా..? అసలు ఎందుకు డిలీట్ చేశారు..?

మెహర్ రమేష్ “రామ్ చరణ్” బర్త్ డే పోస్ట్ లో ఈ మిస్టేక్ చేశారా..? అసలు ఎందుకు డిలీట్ చేశారు..?

by Mohana Priya

Ads

నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టినరోజుని జరుపుకున్నారు. ఎంతో మంది ప్రముఖులు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అందజేశారు. సోషల్ మీడియా అంతటా కూడా నిన్న రామ్ చరణ్ బర్త్ డే గురించిన సెలబ్రేషన్స్ జరిగాయి. రామ్ చరణ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖులు కూడా రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే, రామ్ చరణ్ కి పుట్టినరోజు విషెస్ చెప్పిన వారిలో డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా ఒకరు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి సన్నిహితులు.

Video Advertisement

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటించిన సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని పొందలేదు. మెహర్ రమేష్ సినిమాకి, సినిమాకి మధ్యలో కొంత సమయం తీసుకుంటారు. ఇప్పుడు తర్వాత రాబోతున్న సినిమా గురించి ఇంకా ప్రకటించలేదు. అయితే మెహర్ రమేష్, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపారు. ఫేస్ బుక్ లో ఇందుకు సంబంధించిన పోస్ట్ చేసి, కొన్ని గంటల తర్వాత డిలీట్ చేసేసారు. ఇందులో ఒక చిన్న పొరపాటు చేశారు మెహర్ రమేష్.

meher ramesh mistake in birthday post of ram charan

అదేంటంటే, రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, “మెగాస్టార్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, గ్లోబల్ స్టార్ గా ఎదిగావు” అని రాశారు. అయితే గ్లోబల్ స్టార్ పక్కన ఎన్టీఆర్ అని రాశారు. మెహర్ రమేష్ ఇది పోస్ట్ చేసిన కొంచెం సేపటికే చాలా మంది దీని మీద కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దాంతో, ఇది గమనించిన మెహర్ రమేష్, ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ మాత్రం డిలీట్ చేశారు. మిగిలిన సోషల్ మీడియా మాధ్యమాల్లో చేసిన పోస్ట్ అలాగే ఉంచారు. సాధారణంగా ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు ఎడిట్ చేసే ఆప్షన్ ఉంటుంది. కానీ మెహర్ రమేష్ పోస్ట్ డిలీట్ చేశారు. ఇప్పుడు మెహర్ రమేష్ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి చూసినవారికి ఈ పోస్ట్ కనిపించే అవకాశం లేదు. కానీ నిన్న మాత్రం ఈ పోస్ట్ చాలా మంది చూశారు.

ALSO READ : “రామ్ చరణ్-ఉపాసన” పెళ్లి పత్రిక చూశారా..? ఇందులో ఏం రాసిందో తెలుసా..?


End of Article

You may also like