ఇటీవల కాలంలో తెలుగు ఆడియెన్స్ ను ఎక్కువగా ఆకట్టుకున్న టీజర్, ఏదంటే ఓజి మూవీ టీజర్ అని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూన్న ఈ సినిమాను డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. పవర్ స్టార్  ను సరికొత్తగా చూపిస్తూ రిలీజ్ చేసిన ‘ఓజీ’ టీజర్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

Video Advertisement

అభిమనులకు మాత్రమే కాకుండా తెలుగు ఆడియెన్స్ కూడా ఓజి టీజర్ చాలా నచ్చింది. పవన్ కళ్యాణ్ స్ట్రైట్ సినిమాలతో, తన ఇమేజ్‌కు సరిపోయే మూవీ చేస్తే ఎలా ఉంటుందనేది ‘ఓజీ’ చూపించిందని అంటున్నారు. అయితే ఈ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇద్దరు ప్రముఖ నటులు కనిపించారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ నటిస్తున్న మూవీ ఓజి. ఈ చిత్రంలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సాహో డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్, సుజిత్ కాంబో ప్రకటించినప్పటి నుండే ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. మేకర్స్ ఎప్పటికప్పుడు మూవీ అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ సినిమా పై అంచనాలను పెంచుతూ వస్తున్నారు.
పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అయిన తరువాత సినిమా పై అంచనాలి మరింతగా పెరిగిపోయాయి. పవన్ లుక్స్, యాక్షన్ తో ఉన్న టీజర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యూత్ అంతా ఓజి టీజర్ తో ఊగిపోతున్నారు. ఇప్పటికీ ఈ టీజర్ గురించి నెట్టింట్లో చర్చలు జరుగుతునే ఉన్నాయి.ఒకటని కాకుండా కాస్ట్యూమ్స్, కత్తి, గన్ ఇలా టీజర్ లో చూపించిన ప్రతి ఒక్క దాని గురించి ఫ్యాన్స్ చర్చిస్తున్నారు. అయితే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా మరో ఇద్దరు సినీ స్టార్స్ కూడా ఉన్నారు. వారిలో ఒకరు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి. ఈ మూవీలో విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరొకరు కోలీవుడ్ నటి శ్రియారెడ్డి. ఆమె ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

Also Read: “పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాకి దొరికిన అదృష్టం..! కాదంటారా..?” అనే ప్రశ్నకి… ఈ నెటిజన్ పోస్ట్ చూశారా..?