పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి, ఆయనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. సాధారణంగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ పవర్ స్టార్ కు భక్తులు ఉంటారని చెబుతారు.

Video Advertisement

పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతూ, మరోవైపు రాజకీయాల్లో అడుగు పెట్టి, జనసేన పార్టీని స్థాపించి ముందుకువెళ్తున్నారు. ఏ ప్రశ్నకు అయినా జవాబు దొరికే కోరాలో ‘పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు సినిమాకి దొరికిన అదృష్టం, కాదంటారా?’ అని అడుగగా ఒక యూజర్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక సంచలనం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా, తన దైన రీతిలో నటిస్తూ, సినిమా సినిమాకి అభిమానులను, క్రేజ్ ను పెంచుకుంటూ పవర్ స్టార్ గా ఎదిగారు. సినిమాల కన్నా పవన్ వ్యక్తిత్వంతో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో సైతం పవన్ ను  అభిమానించే హీరోలు ఎంతో మంది ఉన్నారు. పాలిటిక్స్ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్, జనసేనానిగా ప్రజల సమస్యల పై తన గొంతు వినిపిస్తున్నారు. ఇటు ఇండస్ట్రీలోనూ వరస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇది ఇలా ఉంటే కోరాలో “పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు సినిమాకి దొరికిన అదృష్టం, కాదంటారా?” అనే ప్రశ్నను అడుగగా, రమేష్ బోనం అనే యూజర్ ” ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు ఎవరో కానీ పవన్ కళ్యాణ్ ని తిట్టించడానికి కావాలని అడిగినట్టు వుంది. ఈ ప్రశ్న అడిగిన వారి మానసిక స్థాయి ఏంటో కూడా చూడాలి. ఎందుకంటె ఎవరికీ అనిపించనిది, నిజం కానిది వాళ్లకి ఎలా అనిపించింది అని.
పవన్ కళ్యాణ్ కి కానీ ఇప్పటి యువ హీరోస్ ఎవరికైనా కానీ తెలుగు సినిమాకి దొరికిన అదృష్టం అనే స్థాయి లేదు అని అందరికీ తెలుసు. ఆన్సర్స్ రాసే వాళ్ళు కొంచెం అది కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఒక వేళ అలా అనాల్సి వస్తే ఒక సీనియర్ ఎన్టీఆర్, ఏయన్నార్ , కృష్ణ , చిరంజీవి లాంటి వాళ్లకి మాత్రమే ఆ స్థాయి వుంది” అని చెప్పుకొచ్చారు.

Also Read: “అతడు” తర్వాత “మురళీ మోహన్” సినిమాలు ఆపేయడానికి కారణం ఇదేనా..? అసలు విషయం ఏంటంటే..?