Ads
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ హీరోలు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ముందుగా విలన్ పాత్రలు చేశారు.. ఆ విధంగా ప్రతినాయకుడి పాత్రలో ఎంతో చక్కగా నటించి, దర్శకనిర్మాతల కళ్ళలో పడి విలన్ క్యారెక్టర్లు వదిలి హీరోలుగా మారి స్టార్ హీరోగా ఎదిగిన ఎంతో మంది హీరోలు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు.
Video Advertisement
ఒక్కసారి స్టార్డమ్ వచ్చాక మళ్లీ విలన్ క్యారెక్టర్ చేయమంటే చాలామంది ఒప్పుకోరు.. కానీ ఈ హీరోలు మాత్రం ఒకే సినిమాలో కథానాయకుడిగా మరియు ప్రతి కథానాయకుడిగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.. అలా చేసిన వారిలో తెలుగు ఇండస్ట్రీలో కాకుండా మిగతా ఇండస్ట్రీల్లో కూడా ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు..
మరి ఆ విధంగా నటించిన ఆ స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
#1 కమల్ హాసన్ – అభయ్, దశావతారం
అభయ్ సినిమాతో పాటు దశావతారం లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు కమల్ హాసన్.
#2 విక్రమ్ – ఇంకొక్కడు
2016 లో వచ్చిన ఈ చిత్రం లో విక్రమ్ విలన్ పాత్రలో కూడా నటించి మెప్పించారు.
#3 రజినీకాంత్ – రోబో
దర్శకుడు శంకర్ రజనీకాంత్ తో చేసిన రోబో మూవీ లో రోబో పాత్రలో నటించిన రజనీకాంత్ కి నెగటివ్ షేడ్స్ ఉంటాయి.
#4 అజిత్ – వాలి
1999 లో వచ్చిన వాలి చిత్రం లో అజిత్ కవలలుగా నటించారు. అందులో ఒక పాత్ర విలన్ కేరెక్టర్.
#5 సూర్య – 24
విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో వచ్చిన 24 చిత్రం లో విలన్ గా కూడా సూర్య నటించారు.
#6 కార్తీ – కాష్మోరా
2016 లో వచ్చిన కాష్మోరా చిత్రం లో కార్తీ హీరో, విలన్ గా నటించారు.
#7 బాలకృష్ణ – సుల్తాన్
1999 లో విడుదలైన చిత్రం సుల్తాన్. ఈ చిత్రంలో బాలకృష్ణ ఎనిమిది పాత్రలు పోషించాడు. అందులో విలన్ పాత్ర కూడా ఒకటి.
#8 వెంకటేష్ – నాగవల్లి
నాగవల్లి సినిమాలో వెంకటేష్ డ్యూయెల్ రోల్ ఫ్లే చేశాడు. వందేండ్లు దాటిన రాజు, యంగ్ ఏజ్ హీరో క్యారెక్టర్లు వెంకీనే చేశాడు.వృద్ధ రాజే మూవీలో విలన్. సినిమా చివరిలో యంగ్ వెంకటేష్.ముసలి వెంకటేష్ ను చంపేస్తాడు.
#9 గోపీచంద్ – గౌతమ్ నంద
గౌతమ నందా సినిమాను సంపత్ నంది తెరకెక్కించాడు.ఇందులో గోపీచంద్ రెండు పాత్రలు చేశాడు.అందులో ఒకటి నెగెటివ్ రోల్.చివరకు పాజిటివ్ క్యారెక్టర్ చేతిలో… నెగెటివ్ క్యారెక్టర్ చనిపోతుంది.అంటే ఈ సినిమాలో హీరో, విలన్ రెండు పాత్రలు గోపీచంద్ పోషించడం విశేషం
#10 జూ. ఎన్టీఆర్ – జై లవ కుశ
ఎన్టీఆర్ కూడా జై లవకుశ చిత్రం లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. మరో వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఎన్టీఆర్ చేయనున్న తదుపరి చిత్రంలో విలన్ కూడా ఎన్టీఆర్ అన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
End of Article