గోపీచంద్ లాగే… అటు హీరో ఇటు విలన్ గా మెప్పించిన 15 మంది టాలీవుడ్ నటులు వీరే.!

గోపీచంద్ లాగే… అటు హీరో ఇటు విలన్ గా మెప్పించిన 15 మంది టాలీవుడ్ నటులు వీరే.!

by Anudeep

Ads

సినిమాకు హీరో ఎంత ముఖ్యమో, విలన్ కూడా అంతే ముఖ్యం. ఇంకా చెప్పాలి అంటే.. విలన్ లేకుండా హీరోనే లేడు. విలన్ ఎంత స్ట్రాంగ్ అయితే హీరోని అంత ఎక్కువ చేసి చూపించే అవకాశం ఉంటుంది.
ఒక యాక్టర్ పరిపూర్ణ నటుడు అవ్వాలి అంటే మాత్రం హీరోగా, విలన్ చేసి అన్నీ రకాల ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. అందుకే హీరో కెరీర్ ని లీడ్ చేస్తున్నప్పుడే మన హీరోలు విలన్ పాత్రలతో కూడా మెప్పించారు. విలన్ పాత్రలు కొంతమంది కెరీర్ గ్రాఫ్ నే మార్చేసాయి. వాళ్ళల్లో కొంతమందిని చూద్దాం . .

Video Advertisement

1. జగపతిబాబు:

అప్పటి వరకు జగపతిబాబును ఫ్యామిలీ మ్యాన్ గా చూసిన అభిమానులు ఆయన నుంచి అంత క్రూరత్వాన్ని, దుర్మార్గాన్ని ఎవరు ఊహించలేదు. లెజెండ్ లో జితేంద్ర ఈవిల్ ఓ రకం అనుకుంటే, రంగస్థలం ఫణీంద్రభూపతి ఇంకా దారుణం, అరవింద సమేతలో బసిరెడ్డి క్యారెక్టర్ తో విలనిజాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు.

2. శ్రీకాంత్:

హీరోగా ప్రేక్షకులను మెప్పించి విలన్ గా చేసి వాళ్లలో శ్రీకాంత్ కూడా ఒకడు. యుద్ధం శరణం, మార్షల్, మలయాళ చిత్రం విలన్ తో పాటు ఇటీవల అఖండలో నెగటివ్ పాత్ర చేసి అందరిని ఆకట్టుకున్నాడు శ్రీకాంత్.

3. గోపీచంద్:


మనం పాజిటివ్ పాత్రలో కాకుండా నెగెటివ్ రోల్‌లో చూడటానికి ఇష్టపడే మరో నటుడు గోపీచంద్. నిజం, వర్షం, జయం సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను సైతం భయపెట్టే రేంజ్ లో నటించాడు. గౌతమ్ నందలో హీరోయిజం కన్నా తన విలనిజానికే ఎక్కువ మార్కులు పడ్డాయి.

4. రానా:


రానా తనలో ఉన్న హీరో కన్నా నటుడిని ఎక్కువ సంతృప్తి పరుస్తాడు. బాహుబలి లాంటి సినిమాలో ప్రభాస్ లాంటి కటౌట్ ముందు.. తనదైన నటనా కౌశలంతో దుష్టత్వంతో ఒక రేంజ్ ఆవేశం సృష్టించాడు రానా. ఇటీవల భీమ్లా నాయక్ లో రానా పాత్రను పవన్ అభిమానులు కూడా ప్రశంసించారు.

5. చిరంజీవి:


మెగాస్టార్ చిరంజీవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోగా ఆయనకున్న అభిమానులకు కొదవే లేదు. ఆయన మాటలు, మేనరిజం, డాన్స్ అన్నీ వేరే లెవెల్ లో ఉంటాయి . అలాంటిది చిరు కూడా ఒకప్పుడు ఇది కథ కాదు, మోసగాడు, న్యాయం కావాలి వంటి చిత్రాల్లో నెగటివ్ రోల్స్ చేశారు.

6. విజయ్ సేతుపతి:


విజయ్ సేతుపతిని ఒకసారి 96 మూవీ చూసి ఉప్పెన, మాస్టర్, విక్రమ్ మూవీల్లో చూస్తే షాక్ అవుతాము. నాయకుడు, ప్రతినాయకుడు అనే తేడాని యాక్టింగ్ లో పర్ఫెక్ట్ గా ప్రెసెంట్ చేస్తాడు విజయ్ సేతుపతి.

7. కార్తికేయ గుమ్మకొండ:


ఓ పక్క హీరోగా చేస్తూనే కార్తికేయ విలన్ పాత్రలతో కూడా మెప్పించాడు. నాని హీరోగా చేసిన గ్యాంగ్‌లీడర్ లో కార్తికేయ పాత్రకి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఆ ఎమోషన్స్ అన్నింటిని కార్తికేయ బాగా చూయించాడు. అలాగే ఇటీవల తెలుగులో డబ్ అయ్యి వచ్చిన తమిళ చిత్రం వలీమైలో కూడా తనలోని విలనిజంను చూయించాడు కారికేయ.

8. వరుణ్ తేజ్:


వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ వంటి విలన్ సెంట్రిక్ కథని చేయడమే కాకుండా, ఆ పాత్రకి తగ్గ రాక్షసత్వాన్ని 100% చూయించాడు ఈ మెగా ప్రిన్స్.

9. నాని:


జెంటిల్‌మన్ సినిమాలో తనలో ఉన్న నెగెటివ్ షేడ్ ని కాస్త టేస్ట్ చూపించారు న్యాచురల్ స్టార్ నాని. అనంతరం ‘వి’ సినిమా కోసం పూర్తిగా బ్యాడ్‌గా మారిపోయాడు. మనలో చాలా మంది నెగెటివ్ రోల్స్ లో చూడాలనుకుంటున్న హీరోలలో నాని ఒకరు.

10. మోహన్ బాబు:


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా హీరోగా మెప్పిస్తూనే.. కొదమ సింహం, సర్ధార్ పాపరాయుడు, అడవి దొంగ చిత్రాల్లో నెగటివ్ పాత్రల్లో నటించారు.

11. సాయి కుమార్:

ఓ వైపు హీరోగా చేస్తూనే విలన్ పాత్రల్లో మెప్పించిన నటుల్లో సాయికుమార్ ఒకరు. మేజర్ చంద్రకాంత్, రౌడీ దర్బార్, ప్రస్ధానం వంటి సినిమాల్లో సాయి కుమార్ ప్రతి నాయకుడి పాత్రలో నటించారు.

12. జేడీ చక్రవర్తి:


గులాబీ, ప్రేమకు వేళాయరా వంటి సినిమాల్లో లవర్ బాయ్ గా కనిపించే జేడీ కూడా శివ, జోష్ వంటి చిత్రాల్లో విలన్ క్యారెక్టర్ లో చేసాడు.

13. శ్రీహరి:


రియల్ హీరో శ్రీహరి తన సినీ జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అందులో మూఠామేస్ట్రీ, అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా వంటి చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో మెప్పించారు.

14. మాధవన్:


సఖి, చెలి సినిమాల టైంలో మాధవన్ కి అమ్మాయిల్లో క్రేజ్ మాములుగా ఉండేది కాదు. నవ్వితే డింపుల్ వచ్చే హ్యాండ్సమ్ పర్సనాలిటీ, అలాంటి పర్సన్ నెగెటివ్ షేడ్ ఎలా చేస్తాడో అనుకునే వాళ్లకి సవ్యసాచిలో మాధవన్ తన నటనతో సమాధానమిచ్చాడు.

15. ఆది పినిశెట్టి:


తెలుగు దర్శకుడు రవిరాజా పినిశెట్టి అబ్బాయిగా “ఒక వి చిత్రం” అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేసిన ఆది పినిశెట్టి, తమిళంలో హీరోగా సెటిల్ అయ్యి, మళ్లీ టాలీవుడ్ లోకి వచ్చాడు. సరైనోడు, అజ్ఞాతవాసి సినిమాల్లో విలన్ గా చేసాడు. ప్రస్తుతం రామ్ వారియర్ లో విలన్ రోల్ చేస్తున్నాడు.

బిజినెస్ మేన్ లో సూర్య భాయ్ గా మహేష్ బాబు, జైలవకుశలో రావణ్ గా జూనియర్ ఎన్టీఆర్, ఆర్య 2 లో ఆర్యగా అల్లుఅర్జున్, ఇలా స్టార్ హీరోలు కూడా అవకాశం దొరికినప్పుడల్లా పాజిటివ్ రోల్ లో కాస్త నెగెటివ్ షేడ్ ని మిక్స్ చేసి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న వాళ్లే.


End of Article

You may also like