డాక్టర్స్ కాబోయి యాక్టర్స్ అయినవారు మన సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అదే విధంగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రూల్ తో  కొత్త కొత్త బిజినెస్స్ లో దూసుకుపోతున్న స్టార్స్ కూడా ఉన్నారు. అబ్బో ఇలా మన తారల్లో ఎన్నెన్నో కలలు ఉన్నాయి.

Video Advertisement

అదేవిధంగా స్పోర్ట్స్ స్పిరిట్ తో క్రీడారంగంలో దూసుకుపోదామని యాక్టర్స్ అయిన వాళ్లు కూడా ఉన్నరండోయ్ మన చిత్ర పరిశ్రమలో. కొన్ని చిత్రాలలో  వాళ్ళలో మనకి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్లు నిజ జీవితంలో స్పోర్ట్స్ మెన్ అయ్యివుంటారు కాబట్టి.

మరి రియల్ లైఫ్ లో మన తెలుగు ఇండస్ట్రీ నటులు ఏ  స్పోర్ట్స్ లో ఎక్స్పర్ట్స్ అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..

#1. నాగ చైతన్య :

 Naga chaitanya as a car racer

జోష్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నాగచైతన్య ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అంతే కాకుండా తన నటనకు ఎన్నో అవార్డు కూడా గెలుచుకున్నాడు నాగచైతన్య.  అయితే నాగచైతన్య సినిమాల్లోకి రాక ముందు నుంచే ప్రొఫెషనల్ కార్ రేసర్. ఇప్పటికి కూడా F1 ట్రాక్ లో తన సత్తా ఏంటో చాటి చూపిస్తాడు.

#2. సుధీర్ బాబు :

Sudheer babu

సుధీర్ బాబు తన నటనతో టాలీవుడ్ లో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో అదేవిధంగా నిజజీవితంలో బ్యాట్మెంటన్ క్రీడాకారుడు మరియు మార్షల్ ఆర్ట్స్ లో కూడా మంచి శిక్షణ పొందాడు. సుధీర్ బాబు త్వరలో పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో గోపీచంద్ గా నటించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

#3. రితిక సింగ్ :

గురు చిత్రంలో వెంకటేష్ సరసన రితిక సింగ్ బాక్సర్ గా తన అద్భుతమైన నటనను కనబరిచింది. ఈవిడ నిజజీవితంలో మంచి కిక్ బాక్సర్ అండ్ మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఎక్స్పర్ట్. వీటితో పాటు యాక్టింగ్ కూడా నేను సూపర్ గా చేయగలను అంటూ ధీమాగా చెబుతుంది రితిక సింగ్.

#4. అవసరాల శ్రీనివాస్:

Avasarala srinivas

అష్టా చమ్మా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అవసరాల శ్రీనివాస్ నటుడిగా, దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన రియల్ లైఫ్ లో ప్రొఫెషనల్ రాకెట్ బాల్ ప్లేయర్.

#5.రకుల్ ప్రీత్ సింగ్:

actors who are from sports background

నేటితరం అందరి హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీతిసింగ్ నటనలోనే కాదు స్పోర్ట్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఫిట్నెస్ మీద కూడా ఎక్కువగా శ్రద్ద చూపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణి.

#6. నాగ శౌర్య :

నటుడిగా సినీరంగంలోని కి రాకముందు నాగ శౌర్య జాతీయస్థాయి టెన్నిస్ క్రీడాకారుడు. ఎప్పుడైతే సినీ పరిశ్రమకి పరిచయమయ్యాడో టెన్నిస్ క్రీడకు దూరమయ్యాడు.