విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తోన్న ‘ఇండియన్ 2’ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. దర్శకుడు శంకర్ ‘ఇండియన్ 2’, ‘ఆర్‌సీ 15’ రెండు సినిమాల షూటింగ్‌లతో బిజీబిజీగా ఉన్నారు. ‘ఇండియన్ 2’ షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని దీపావళి కి విడుదల చేయనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నారు.
Video Advertisement
నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ నిర్మాతలకు, శంకర్‌కు మధ్య వచ్చిన బడ్జెట్ సమస్యలు సహా కరోనా వంటి కారణాలతో మధ్యలోనే సినిమా షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ అన్ని సమస్యలు పూర్తి చేసుకొని షూటింగ్ ని జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలోని ఆదిత్య రామ్ స్టూడియోస్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ సినిమాలో ఏకంగా ఆరుగురు విలన్లు ఉండబోతున్నారట.
#1 సముద్రఖని
ప్రముఖ టాలీవుడ్ నటుడు సముద్రఖని అందులో ఒక విలన్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈయనతో పాటు
#2 బాబీ సింహా
#3 జయప్రకాష్
#4 గురు సోమసుందరం
#5 మరిముత్తు
#6 శివాజీ గురువాయూర్
ప్రతినాయక పాత్రలను చేస్తున్నారు అని సమాచారం. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఒక విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అవి నిజం కాదని ఆయన వెల్లడించారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. గతంలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా కూడా భారీ విజయం సాధించింది. ఇప్పటివరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్, పోస్టర్స్‌కు భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇంతకు ముందు ముందు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘విక్రమ్’ మూవీ భారీ విజయం సాధించింది. చాలా ఏళ్ల తర్వాత కమల్ హాసన్‌కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఇదే ఊపులో ‘ఇండియన్ 2’ చిత్రాన్ని కంప్లీట్ చేసి విజయం సాధించాలని డైరెక్టర్ శంకర్, కమల్ భావిస్తున్నారట.