సినిమా నుండి ఆధ్యాత్మికత వైపు వెళ్లిన 8 నటులు…ఎవరి కథ ఏంటో చూడండి!

సినిమా నుండి ఆధ్యాత్మికత వైపు వెళ్లిన 8 నటులు…ఎవరి కథ ఏంటో చూడండి!

by Mohana Priya

Ads

జీవితం మొత్తం చాలా కష్టపడి, మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న వారు ఒక సమయంలో కచ్చితంగా కోరుకునేది ప్రశాంతత. ఆ ప్రశాంతత కోసం ఎక్కువగా ఎంచుకునే దారి ఆధ్యాత్మికత. ఒక్కొక్కసారి ఎంత సంపాదించినా కూడా జీవితంలో ప్రశాంతత లేకపోతే ఆ సంపాదన అంతా వృధా అయిపోతుంది.

Video Advertisement

మనకి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి తిరిగి సేవ చేయగలిగితే అంతకంటే గొప్ప పని లేదు అని ఎంతోమంది నమ్ముతారు. ఒకవేళ జీవితంలో చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నప్పుడు అటు రోజు వారి పనులు, ఇటు ఆధ్యాత్మిక చింతన రెండిటిని మేనేజ్ చేస్తారు.

అదే ఒకవేళ చాలా కష్టపడ్డాం ఇంక చాలు అనుకున్న వాళ్లు తమ జీవితం మొత్తం ఆధ్యాత్మికత లోనే ఉంటారు. అలా చాలామంది సినిమా రంగానికి చెందిన వాళ్లు కూడా నటనను మధ్యలో ఆపేసి ఆధ్యాత్మికత వైపు వెళ్లారు.సినిమా నుండి ఆధ్యాత్మికత వైపు వెళ్లిన నటులు ఎవరు అంటే.

#1 సోఫియా హయత్

హిందీ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా వచ్చారు నటి ఇంకా మోడల్ అయిన సోఫియా హయత్. తర్వాత ఒకరోజు సినిమారంగాన్ని వదిలేసి ఆధ్యాత్మికత వైపు వెళుతున్నాను అని ఇక నుండి తన పేరు సోఫియా హయత్ కాదు మదర్ సోఫియా అని మీడియా ద్వారా చెప్పారు.

#2 వినోద్ ఖన్నా

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమాలను వదిలేసి తను ఎంతగానో ఆరాధించే ఓషో దగ్గర ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకున్నారు వినోద్ ఖన్నా. ఐదేళ్ల ఆధ్యాత్మిక చింతన తర్వాత 1986లో మళ్లీ సినిమాల్లోకి వచ్చారు.

#3 మమతా కులకర్ణి

90 లో టాప్ హీరోయిన్ అయిన మమతా కులకర్ణి సినిమాలను వదిలేసి ఇస్లాం మతం తీసుకున్నారు. ఆ తర్వాత విక్కీ గోస్వామి ని పెళ్లి చేసుకున్నారు. 12 ఏళ్ల నుండి బ్యూటీ పార్లర్ వైపు కూడా చూడలేదు అని చెప్తారు మమతా కులకర్ణి.

#4 అను అగర్వాల్

ఆషికి సినిమాతో అందరికీ చేరువైన అను అగర్వాల్ తర్వాత ఆధ్యాత్మికత వైపు వెళ్లారు. పెద్ద యాక్సిడెంట్ లో దాదాపు చనిపోయి బతికారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం తన ఆధ్యాత్మిక సేవ చేయడమే కాకుండా ఇతరులకు కూడా ఆధ్యాత్మికత పై అవగాహన కల్పిస్తూ ఆధ్యాత్మిక గురువుగా ఉన్నారు.

#5 రాజా

రాజా కూడా నటుడిగా పేరు వచ్చే సమయంలో సినిమాలను వదిలేసి ఆధ్యాత్మిక బాటలో నడిచారు. క్రిస్టియానిటీ పై అవగాహన కల్పిస్తూ భారతదేశంలోనే కాకుండా యు ఎస్ లో కూడా ఎన్నో క్రిస్టియానిటీ కార్యక్రమాలలో మాట్లాడారు రాజా. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి ఇప్పుడే ప్రశాంతంగా ఉంది అని, జీవితం అంటే ఏంటో తెలిసింది అని చెప్పారు.

#6 బర్ఖా మదాన్

ఖిలాడియోన్ కా ఖిలాడీ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించిన బర్ఖా 2012లో బౌద్ధ సన్యాసినిగా మారారు. తన పేరును కూడా జ్యాల్టెన్ సమ్టేన్ గా మార్చుకున్నారు.

#7 వీణా మాలిక్

నటనా జీవితం లో జరిగినదంతా మర్చిపోయి పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించారు వీణా మాలిక్. తర్వాత ఇస్లాం తీసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉంటున్నారు.

#8 సుచిత్రాసేన్

25 ఏళ్ళు నటించి ఎంతో పేరు తెచ్చుకున్న సుచిత్ర తర్వాత ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసి రామకృష్ణ మిషన్ లో ఎంతో కాలం తన సేవలను అందించారు.

అలాగే వెంకటేష్, మనీషా కొయిరాలా కూడా అటు సినిమాల లో నటిస్తూనే ఇటు ఆధ్యాత్మికత కి సమయం కేటాయిస్తున్నారు.

 

 


End of Article

You may also like