Ads
సాధారణం గా ఒక భాష లో హిట్ అయిన సినిమాలను మరో భాష లోకూడా రీమేక్ చేస్తుంటారు. సినిమా లో కంటెంట్ బాగుంటే ఇతర భాషల్లో కూడా ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టేస్తాయి. అయితే కొన్నిసార్లు ఒరిజినల్ లో నటించిన కొందరు నటులు రీమేక్ లో కూడా నటిస్తారు.
Video Advertisement
వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..
#1 రేవతి
విక్టరీ వెంకటేష్ తెలుగు బ్లాక్ బస్టర్ ప్రేమ మూవీ ని హిందీ లో లవ్ పేరుతో రీమేక్ చేసారు. సల్మాన్ ఖాన్ హీరో. ఇందులో హీరోయిన్ గా తెలుగులో నటించిన రేవతినే నటించారు.
#2 అనిత
తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నేను’ సినిమా ఉదయ్ కిరణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో అనిత హీరోయిన్. ఈ మూవీ ని హిందీలో ‘ఏ దిల్’ పేరుతో రీమేక్ చేసారు. ఇందులో కూడా అనిత నే హీరోయిన్.
#3 అసిన్
సూర్య హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ ‘గజిని’. ఈ మూవీ ని హిందీ లో ఆమిర్ ఖాన్ హీరోగా రీమేక్ చేసారు. ఈ రెండిటిలో అసిన్ హీరోయిన్ గా నటించింది.
#4 అనుపమ పరమేశ్వరన్
మలయాళ చిత్రం ప్రేమమ్ ని తెలుగులో నాగ చైతన్య హీరోగా రీమేక్ చేయగా.. ఈ రెండిటిలో ఒక హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది.
#5 జెనీలియా
బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన బొమ్మరిల్లు మూవీ ని హిందీలో, తమిళం లో రీమేక్ చేసారు. ఈ అన్ని మూవీస్ లో జెనీలియా నే హీరోయిన్ గా నటించింది.
#6 మడోన్నా సెబాస్టియన్
మలయాళ చిత్రం ప్రేమమ్ ని తెలుగులో నాగ చైతన్య హీరోగా రీమేక్ చేయగా.. ఈ రెండిటిలో ఒక హీరోయిన్ గా మడోన్నా సెబాస్టియన్ నటించింది.
#7 ఐశ్వర్య రాజేష్
తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరుతో రీమేక్ అయిన మూవీ ‘కనా’. ఈ రెండు మూవీస్లో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించింది.
#8 ప్రకాష్ రాజ్
మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ ‘ఒక్కడు’ ని చాలా భాషల్లో రీమేక్ చేసారు. అయితే తమిళం లో విలన్ గా తెలుగులో నటించిన ప్రకాష్ రాజ్ ఏ నటించారు. అలాగే పోకిరి మూవీ హిందీ రీమేక్ లో కూడా ప్రకాష్ రాజ్ నటించారు.
#9 గౌరీ కిషన్
తమిళ్లో త్రిష, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వచ్చిన 96 మూవీ ని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేసారు. ఈ రెండు మూవీస్ లో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో గౌరీ కిషన్ నటించింది.
#10 అవినాష్
కన్నడ లో వచ్చిన ఆప్తమిత్ర మూవీ ని తెలుగులో నాగవల్లి పేరుతో రీమేక్ చేసారు. ఈ రెండు చిత్రాల్లో నటుడు అవినాష్ ఒక కీలక పాత్రలో నటించారు.
#11 మీనా
మలయాళ చిత్రం దృశ్యం మూవీ ని తెలుగులో కూడా రీమేక్ చేసారు. ఈ రెండిటిలో మీనా నటించారు.
#12 జయప్రకాశ్ రెడ్డి
నటుడు జయప్రకాశ్ రెడ్డి రెడీ మూవీ తమిళ రీమేక్ లో కూడా నటించారు.
#13 సచిన్ ఖేడేకర్
అలవైకుంఠపురంలో సినిమాని బాలీవుడ్ లో షెహజాదా గా రీమేక్ చేశారు. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు. ఈ రెండు మూవీస్ లో హీరో తాతయ్యగా సచిన్ ఖేడేకర్ నటించారు.
#14 సంయుక్త హెగ్డే
కన్నడ లో సూపర్ హిట్ అయిన ‘కిరిక్ పార్టీ’ మూవీ ని తెలుగులో ‘కిరాక్ పార్టీ’ గా నిఖిల్ రీమేక్ చేసారు. ఈ మూవీ లో సంయుక్త హెగ్డే ఒక హీరోయిన్ గా నటించింది.
#15 అరవింద స్వామి
జయం రవి హీరోగా వచ్చిన తని ఒరువన్ మూవీ ని తెలుగు లో రామ్ చరణ్ ధృవ గా రీమేక్ చేసారు. ఈ రెండు చిత్రాల్లో విలన్ గా అరవింద స్వామి నటించారు.
End of Article