“రజనీకాంత్” నుండి… “మహేష్ బాబు” వరకు… సినిమా “ఫ్లాప్” అవ్వడంతో డబ్బులు తిరిగి ఇచ్చేసిన 10 యాక్టర్స్..!

“రజనీకాంత్” నుండి… “మహేష్ బాబు” వరకు… సినిమా “ఫ్లాప్” అవ్వడంతో డబ్బులు తిరిగి ఇచ్చేసిన 10 యాక్టర్స్..!

by Anudeep

Ads

సినిమాలు అన్నాక హిట్లు, ఫ్లాపులు కామ‌న్.హిట్ వ‌స్తే సినిమా చేసిన న‌టుల‌తో పాటు ద‌ర్శ‌కుడికి మంచి పేరు వ‌స్తుంది. నిర్మాత‌కు కాసుల వ‌ర్షం కురుస్తుంది. అయితే కొన్నిసార్లు సినిమాలు డిజాస్ట‌ర్లు కావ‌డంతో నిర్మాత‌లు కోలుకోలేని దెబ్బ‌తింటారు. అలాంటి సంద‌ర్భాల్లో హీరోలు, హీరోయిన్లు త‌మ రెమ్యున‌రేష‌న్ డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌డం. లేదంటే మ‌రో సినిమాలో డ‌బ్బులు తీసుకోకుండా న‌టించ‌డం చేస్తారు.

Video Advertisement

ఇప్పుడు అలా రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన నటులు.. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

#1 రజనీకాంత్

బాబా మూవీ రిలీజ్ అయ్యాక డిస్ట్రిబ్యూటర్స్ బాగా లాస్ అవ్వడం తో రజనీకాంత్ తన రెమ్యూనరేషన్ లో చాలా భాగం వాళ్ళకి ఇచ్చేశారట.

the stars who gave back their remunarations to the flop movies..!!

#2 సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సినిమాలకు తన రెమ్మ్యూనరేషన్ వాపస్ ఇచ్చారు. తన సినిమా బోల్తాకొట్టిందంటే నిర్మాతలను ఆదుకోవడంలో ముందుంటారు కృష్ణ. అందుకే ఆయన్ను నిర్మాతల హీరో అనేవారు.

the stars who gave back their remunarations to the flop movies..!!

#3 బాల కృష్ణ

బాలకృష్ణ న‌టించిన గౌతమి పుత్ర శాత‌క‌ర్ణి సినిమా ఆశించిన రిజల్ట్ రాబట్టకపోవడంతో బాలయ్య బాబు తన పారితోషికాన్ని రివర్స్ ఇచ్చేశారు.

the stars who gave back their remunarations to the flop movies..!!

#4 ప‌వన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టించిన జానీ, కొమురంపులి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ప్రొడ్యూస‌ర్ల‌ అంచనాలు తలక్రిందులై భారీ నష్టం వాటిల్లింది. ఈ సమయంలో తాను తీసుకున్న‌ రెమ్యున‌రేష‌న్ వెన‌క్కి ఇచ్చేశారు పవన్ కళ్యాణ్.

the stars who gave back their remunarations to the flop movies..!!

#5 మహేష్ బాబు

మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన సినిమా ఖ‌లేజా సినిమా ఇలాగే బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దీంతో నిర్మాత‌కు భారీగా న‌ష్టం వాటిల్లడంతో ఆ స‌మ‌యంలో మ‌హేష్ బాబు త‌న రెమ్యున‌రేష‌న్ అంతా తిరిగి ఇచ్చేశారు.

the stars who gave back their remunarations to the flop movies..!!

#6 రామ్ చరణ్

రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అట్ట‌ర్ ఫ్లాప్ కావడంతో త‌ను కూడా తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు రామ్ చరణ్.

the stars who gave back their remunarations to the flop movies..!!

#7 సమంత

రీసెంట్ గా సమంత లీడ్ రోల్ లో వచ్చిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అయింది. దీంతో ఈ సినిమాకు గాను తాను తీసుకున్న పారితోషికం మొత్తం వాపస్ చేసిందట.

the stars who gave back their remunarations to the flop movies..!!

#8 విజ‌య్ దేవ‌ర‌కొండ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తీరా విడుదల తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. దీంతో త‌న పారితోష‌కాన్ని వెన‌క్కి ఇచ్చారు విజయ్ దేవరకొండ.

the stars who gave back their remunarations to the flop movies..!!

#9 రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ సినిమాకు గాను తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు రవితేజ.

the stars who gave back their remunarations to the flop movies..!!

#10 సాయి ప‌ల్ల‌వి

సాయి పల్లవి నటించిన ప‌డి ప‌డి లేచే మ‌న‌సు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో త‌న రెమ్యున‌రేష‌న్ ను సాయి ప‌ల్ల‌వి వెన‌క్కి ఇచ్చింది.

the stars who gave back their remunarations to the flop movies..!!

#11 జూనియర్ ఎన్టీఆర్

నరసింహుడు మూవీ ప్లాప్ కావడం తో జూనియర్ ఎన్టీఆర్ తన రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చేసాడు.

the stars who gave back their remunarations to the flop movies..!!

End of Article

You may also like