Ads
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. రాత్రికి రాత్రే కొందరు స్టార్లు అయిపోతే, చూస్తుండగానే కొందరి జీవితాలు దీన స్థితికి చేరుకుంటాయి. సీనియర్ నటి లక్ష్మీ మీకు గుర్తుండే ఉంటారు. మురాలి, నిన్నే పెళ్లాడతా, మిథునం వంటి సినిమాల్లో తన పాత్రతో అందరిని ఆకట్టుకున్నారు.
Video Advertisement
లక్ష్మీ కూతురుగా ఐశ్వర్య సినీ అరంగ్రేటం చేశారు. “న్యాయంగళల్ జయిక్కట్టుం” అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యి 200లకు పైగా చిత్రాల్లో నటించారు ఐశ్వర్య. హీరోయిన్ వేషాలు లేని సమయంలో చిన్నచిన్న పాత్రల్లో కూడా నటించారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆర్థిక కష్టాలను వివరించారు. ఇల్లు గడవడం కష్టం కావడంతో ఇంటింటికి వెళ్ళి సబ్బులు విక్రయిస్తున్నట్టు తెలిపారు.
‘ఇప్పుడు నాకు పని లేకపోవడంతో ఎలాంటి ఆదాయం లేదు. ఇల్లు గడవాలంటే ఏదో ఒక పని కావాలి. అందుకే ఇంటింటికి వెళ్లి సబ్బులు విక్రయిస్తున్నాను. మంచి వేతనం ఇస్తే పాచి పనులు చేసేందుకు కూడా సిద్ధం. ఇప్పుడు నేను చేస్తున్న పని ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాకు అప్పులు లేవు. ఇతర సమస్యలు కూడా లేవు. కానీ, సరైన పని ఒక్కటే లేదు.
screengrab from Multi Mommy (YouTube)
నా కాళ్ళపై నేను నిలబడి జీవిస్తున్నానని గర్వంగా వుంది. నేను నలుగురు పిల్లలతో కలిసి ఉంటున్నాను. యోగా సాధన వల్ల కేవలం ఒక్క పూట మాత్రమే తింటున్నాను. నా క మారాలంటే నాకు ఒక మెగా టీవీ సీరియల్ కావాలి. నేను బతికింది సీరియల్స్ ద్వారానే. నాకు సినిమాలు అన్నం పెట్టలేదు. బుల్లితెర మాత్రమే అన్నం పెట్టింది’’ అంటూ ఐశ్వర్య కన్నీంటి పర్యంతమయ్యారు. చూడాలి ఈ ఇంటర్వ్యూ ద్వారానైనా ఐశ్వర్యకు మంచి అవకాశాలు లభించి మళ్లీ ఒకప్పటి వైభవం వస్తుందేమో.
watch video :
End of Article