Ads
బాహుబలి తరువాత రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అయితే.. ఆయన మూవీ విషయం లో నటి భాగ్య శ్రీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నారో చూద్దాం. ప్రభాస్ హీరో గా నటించిన “రాధేశ్యామ్” మూవీ సంక్రాంతి కానుక గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటి భాగ్య శ్రీ ప్రభాస్ కు తల్లిగా నటించారు అంటూ మొన్నటివరకు వార్తలు వచ్చాయి. ఈ పాత్ర గురించి ఆమె తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు.
Video Advertisement
తాను ప్రభాస్ సినిమాలో తల్లి పాత్ర లో నటించట్లేదు అని ఆమె క్లారిటీ ఇచ్చారు. మరో కీలక పాత్రలో నటిస్తున్నానని, ఆ పాత్ర లేకుంటే “రాధేశ్యామ్” సినిమానే లేదని ఆమె కామెంట్ చేసారు. “రాధేశ్యాం” లో తాను పూర్తి స్థాయి నిడివి ఉండే పాత్రను చేసినట్లు తెలిపారు. ఎక్కువ భాగం షూటింగ్ ఫారిన్ లోనే జరిగిందన్నారు. ఇక నుంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటానని అన్నారు. కొన్ని సన్నివేశాలను సెట్స్ లోనే షూట్ చేసినప్పటికీ.. అవి బాగా వచ్చాయన్నారు. ఈ సినిమా ను థియేటర్ లోనే చూడాలన్నారు. మూడొందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిందని.. ప్రభాస్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ రావడం ఖాయమని అన్నారు.
End of Article