హీరోయిన్ మాధవి లత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల కన్నా సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మొదట్లో సినిమాలలో హీరోయిన్ గా నటించిన మాధవి లత, ఆ తరువాత రాజకీయాల్లో కూడా అడుగుపెట్టింది.
Video Advertisement
అయితే మాధవి లత ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. తరచూ ఆమె పెళ్లి పై నెటిజన్ల ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక నెటిజెన్ ఆమె పై చేసిన కామెంట్ కు బాధపడిన మాధవిలత, అతనికి బదులు ఇస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మాధవి లత ‘నచ్చావులే’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2008లో రిలీజ్ అయిన ఈ మూవీ విజయం సాధించింది. దాంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా మాధవి నాని హీరోగా నటించిన స్నేహితుడా మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత అరవింద్-2 మూవీలో నటించింది. అయితే ఆమె తొలిసారి నటించిన మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి. ఈ మూవీలో హీరోయిన్ అమృతా రావ్ ఫ్రెండ్ గా నటించింది. ఆమె తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించారు.
మాధవి లత 2018 లో రాజకీయాల్లో అడుగుపెట్టింది. బిజెపి పార్టీలో జాయిన్ అయ్యింది. సినిమాలకు ప్రస్తుతం ఉన్న మాధవి లత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్‌లో ఉంటూ, తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తరచూ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే నెటిజెన్లు ఆమెను తరచూ ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు అడుగుతుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఒక నెటిజెన్ మాధవి లత పై కామెంట్ చేశారు. ఆ కామెంట్ పై బాధపడిన, మాధవి ‘‘పెళ్లి పెటాకులు లేక కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నావ్ అన్నాడు. అందుకే వాడికి జవాబు చెప్తున్నా’’ అని ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
watch video:
Also Read: “బేబీ” సినిమా మీద సీరియస్ అయిన కమిషనర్..! అసలు విషయం ఏంటంటే..?