సినిమా, టీవీ రంగాలు పైకి రంగులు వెదజల్లుతాయి..వెలుగుల రంగం గా పేరు పొందిన ఈ రంగాల్లో ఉండే చీకట్లు తక్కువేమి కాదు. కొన్ని కొన్ని సార్లు వారి ప్రైవేట్ లైఫ్ కూడా పబ్లిక్ అయిపోతూ ఉంటుంది. వారి పై లేని పోనీ నిందలు పడుతూ ఉంటాయి. ఇవన్నీ భరిస్తూనే నెట్టుకొచ్చే సినీ ఆర్టిస్ట్ లు ఎందరో ఉంటారు. అందులోను లేడీ ఆర్టిస్ట్ లు అంటే.. తొందరగా నోరు జారే వారు ఎక్కువ మంది ఉంటారు. వాళ్లకి సరిగ్గా సమాధానం చెప్పగలిగే దమ్ము ఈ రంగం లో సెటిల్ అయ్యేవాళ్ళకి ఉండాల్సిందే. అలాంటి పరిస్థితే టివి హీరోయిన్ నీలిమ కు ఎదురైంది.

neelima rani pics

నీలిమ రాణి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగం లో కి ఎంట్రీ ఇచ్చారు. కమల్ హాసన్ సినిమా “దేవర్ మగన్” తో ఆమె వెండితెరకి పరిచయమయ్యారు. సంతోష్ సుబ్ర‌మ‌ణియ‌మ్‌, తిమిరు, మోళి, రాజాధి రాజా, ప్రియ‌స‌ఖి, గ‌జినీకాంత్‌, నాన్ మ‌హాన్ అల్ల, శత్రు వంటి సినిమాల్లో ఆమె సపోర్టింగ్ రోల్స్ చేసి కోలీవుడ్ లో మంచి అభిమానాన్ని దక్కించుకున్నారు. దక్షిణాది భాషల్లో పలు టివి సీరియల్స్ లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. మా టీవీ లో వచ్చే “తాళికట్టు శుభవేళ” సీరియల్ లో నీలిమ హీరోయిన్ గా నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా చూరగొన్నారు.

 

నీలిమ రాణి ఎపుడు సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటారు. తాజాగా, ఆమె ఇంస్టాగ్రామ్ లో లైవ్ లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సమయం లో ఓ నెటిజెన్ అసభ్యం గా కామెంట్ చేసాడు..”రాత్రికి ఎంత తీసుకుంటారు మేడం..”అంటూ వెకిలి ప్రశ్నను వేసాడు. దానికి నీలిమ రాణి గట్టి గానే కౌంటర్ ఇచ్చింది. ” బ్రదర్.. నీ నుంచి కొంత హుందాతనాన్ని ఆశిస్తున్నా..ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అవతలి వాళ్ళను వేధించడం అనేది పర్వర్టెడ్ మైండ్స్ ఉన్న వారు చేసే పని.. మీరు సైకాలజిస్ట్ ను కలవండి. మీకు సాయం అవసరం” అని ఘాటు గానే కౌంటర్ ఇచ్చింది నీలిమ రాణి. ఈమె రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది. అందరు ఆర్టిస్ట్ లు ఇలా దృఢం గా ఉండాలని హితవు చెప్తున్నారు.