అలాంటి నటి ప్రేమ గుర్తుండే ఉంటుంది. “దేవి” సినిమా తో మంచి పేరు తెచ్చుకున్న ప్రేమ ఆ తరువాత చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. అందం అభినయం తో ఆకట్టుకున్న ప్రేమ కెరీర్ పీక్స్ లో ఉండగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో విడిపోయారు. అయితే అప్పటినుంచి ఆమె కెమెరాకి దూరం గా, సైలెంట్ గానే ఉంటూ వచ్చారు.

actress prema

ఇటీవలే ఆమె రెండవ పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్న నేపధ్యం లో ఆమె స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. వరుస సినిమాలు చేస్తున్న సమయం లోనే ప్రేమ 2006 వ సంవత్సరం లో వ్యాపారవేత్త జీవన్ అప్పచ్చుని పెళ్లి చేసుకున్నారు. అయితే.. మనస్పర్థలు రావడం తో 2016 లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత ఆమె ఒంటరిగానే ఉంటూ వచ్చారు.

actress prema 2

ఉన్నట్లుండి ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు రావడం తో.. ఆమె స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని ఖండించారు. ఒక టైం లో కాన్సర్ తో ఇబ్బందిపడ్డానని.. ప్రస్తుతం తాను చాలా ఆరోగ్యం గా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు దేవి సినిమా తో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దేవత పాత్రల్లోనూ, భక్తురాలి పాత్రల్లో కూడా ఆమె నటించి ఆకట్టుకున్నారు.