గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన మణిరత్నం మాగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్’ తమిళంలో ఘనవిజయమే సాధించినా.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అది రుచించలేదు. మధ్యలో ఆగిన ఆ కథను కొనసాగిస్తూ ఇప్పుడు ‘పొన్నియన్ సెల్వన్-2’తో వచ్చాడు మణిరత్నం. అయితే తమిళం లో మాత్రం ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
Video Advertisement
అయితే ఈ మూవీ లో నటించిన అందరి నటనకి మంచి మార్కులే పడ్డాయి.ముఖ్యం గా కుందవై పాత్రలో త్రిష కూడా ఇట్టే ఒదిగిపోయి చాలా అద్భుతంగా నటించింది. పురుషుల ప్రపంచంలో, ధైర్యం ఉన్న స్త్రీగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించింది యువరాణి కుందవై పిరట్టియార్. ఆమె పాత్రలో త్రిష కూడా అంతే హుందాగా కనిపించింది. ముఖ్యంగా త్రిష – ఐశ్వర్య రాయ్ పాత్రల మధ్య వ్యూహాల పోరు అద్భుతం గా ఉన్నాయి.
ఈ సినిమా మొదటి భాగానికి అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించగా, ఈ సినిమా రెండో భాగం కొద్ది రోజుల క్రితమే విడుదలైంది. ఈ చిత్రం విడుదలై అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం కూడా మొదటి పార్ట్ లాగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ మూవీ లో త్రిష చిన్నప్పటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో ఎవరు ఈ అమ్మాయి అని అందరికి ఆసక్తి పెరిగింది. అయితే చిన్నప్పటి కుందవై పాత్రలో నటించిన ఆ పాప పేరు నీల. ఈమె తల్లిదండ్రులు కూడా ఈ రంగం లోనే ఉన్నారు. ప్రముఖ తార జంట కవితా భారతి-కన్యా భారతి కుమార్తె నీల.
నీల తల్లి కన్యా భారతి ఎన్ను స్వానర్థం జాని, తమిళ మగల్, వల్లి, దైవం తాండ వీడు, అంబే వా వంటి పలు సీరియల్స్ లో నటించారు. అలాగే నీల తండ్రి కవితా భారతి కూడా పలు పాపులర్ సీరియల్స్ లో నటించారు. వీరి ఫామిలీ ఫోటోలను చుసిన ఫాన్స్ అందరు షాక్ అవుతున్నారు.