సినిమా అనే రంగుల లోకం అందరిని ఊరిస్తూనే ఉంటుంది. ఒక రకమైన మూస ధోరణిలో సినిమాలు రిలీజ్ అయిపోతున్న టైం లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఒక మాములు హీరోగా చిరంజీవి అడుగు పెట్టినప్పటికీ.. తన టాలెంట్ తో మెగాస్టార్ అన్న టైటిల్ ను సొంతం చేసుకున్నారు.

Video Advertisement

ఈ సినిమా రంగుల ప్రపంచంలో ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా ఇమిడిపోయి చేయాల్సి ఉంటుంది. అయితే.. పాత్రతో సంబంధం లేకుండా నటులుగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది అంత సామాన్యమైన విషయం అయితే కాదు. ఎందుకంటే.. ఇది కేవలం ఒక్క నటుడికి సంబంధించిన విషయం కాదు.

sujatha

నటీనటులకు సంబంధించి ఏ పెయిర్ కి అయినా హిట్ పెయిర్ అన్న టాక్ వచ్చిందంటే.. వారిని మళ్ళీ అలానే చూడాలి అని ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు. మరో పాత్రలో వారు కనిపించినా ఆదరించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అప్పటికే హిట్ పెయిర్ గా పరిచయమైనా ఆ జంటకి అభిమానులు ఉంటారు. వారు మరో పాత్రలో తమ అభిమాన నటీనటులను చూడడానికి ఇష్టపడకపోవచ్చు. అందుకే ఒకసారి హిట్ పెయిర్ గా టాక్ తెచ్చుకున్న తరువాత ఎలాంటి పాత్రలు పడితే అలాంటి పాత్రలు చేయడానికి స్టార్ హీరో హీరోయిన్లు సైతం ఆలోచిస్తూ ఉంటారు.

sujatha 1

అయితే.. మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ సుజాతది మాత్రం విచిత్రమైన కలయిక అని చెప్పవచ్చు. వీరి కాంబో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ.. వీరు ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో కనిపించారు. ఒక సినిమాలో ప్రేమికులుగా కనిపించారు. మరో సినిమాలో అన్నాచెల్లెళ్లు గా కనిపించి ఆశ్చర్య పరిచారు. అంతటితో అవలేదు.. మరో సినిమాలో ఏకంగా తల్లీకొడుకులుగా కనిపించి అలరించారు. హిందీలో సూపర్ హిట్ అయిన ముకందర్ కా సికందర్ అనే సినిమాను తెలుగులో ప్రేమ తరంగాలుగా రీమేక్ చేసారు. ఈ సినిమాలో అమితాబ్ నటించిన రోల్ లో చిరంజీవి నటించారు.

sujatha 2

ఈ సినిమాలో సుజాత, చిరంజీవి ప్రేమికులుగా కనిపించి మెప్పించారు. ఈ సినిమా తరువాత 1982 లో సీతాదేవి అనే సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో సుజాత మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా కనిపిస్తారు. ఈ సినిమాకు ఈరంకి శర్మ దర్శకత్వం వహించారు. తరువాత విజయ బాపినీడు దర్శకత్వంలో బిగ్ బాస్ అనే సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరు, సుజాత తల్లీ కొడుకులుగా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే.. ఏ రోల్ లో నటించినా వీరిని అభిమానులు ఆదరించారనే చెప్పాలి.