Ads
రామాయణం సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. హీరో యష్, రావణాసురుడు పాత్రలో నటిస్తున్నారు. అదే కాకుండా, ప్రముఖ నటుడు సన్నీ డియోల్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ప్రముఖ హిందీ సీరియల్ నటుడు రవి దుబే లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంలో సోషల్ మీడియాలో, ఈ సినిమాలో నటించే మరొక వ్యక్తి గురించి వార్త వచ్చింది.
Video Advertisement
అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. ఈ సినిమాలో సీత చిన్నప్పటి పాత్రలో ఒక అమ్మాయి నటిస్తోంది. ఆ అమ్మాయి పేరు కియారా సాద్. కియారా సాద్ హిందీ సీరియల్స్ లో నటించింది. స్టార్ ప్లస్ లో ప్రసారం అవుతున్న పాండ్యా స్టోర్ అనే సీరియల్ చుట్కి అలియాస్ నటాషా అనే పాత్రలో కియారా నటించింది. ఆ తర్వాత సోనీ లివ్ లో వచ్చిన రైసింఘాని వర్సెస్ రైసింఘాని అనే ఒక సిరీస్ లో కూడా హీరోయిన్ జెన్నీఫర్ వింగెట్ పోషించిన అనుష్క పాత్ర చిన్నప్పటి పాత్రను పోషించింది. కొన్ని అడ్వటైజ్మెంట్స్ లో కూడా నటించింది. ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి.
సినిమా బృందం షూటింగ్ మొదలు పెట్టింది. ముఖ్య పాత్రధారుల మీద ఇప్పటికే కొన్ని సీన్స్ షూట్ చేశారు. హీరోయిన్ లారా దత్తా కూడా ఇందులో నటిస్తున్నారు. అంతే కాకుండా, ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు ఇందులో నటించబోతున్నారు. ముందుగా సీత పాత్ర కోసం ఆలియా భట్ అని అనుకున్నారు. తర్వాత సాయి పల్లవి ఈ పాత్ర చేస్తున్నారు. రణబీర్ కపూర్ ఈ సినిమా కోసం ప్రత్యేకమైన నియమాలు పాటిస్తున్నారు. ఎంతో శ్రద్ధగా ఈ సినిమా చేస్తున్నారు. ఇటీవల శ్రీరామనవమి రోజు ఈ సినిమాకి సంబంధించి ప్రకటన వస్తుంది అని అన్నారు. కానీ అలాంటిది ఏమీ రాలేదు. ఈ సినిమాకి ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టి, లేదా ఒక టీజర్ లాగా ఈ సినిమాకి సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
End of Article