ప్రత్యూష నుండి దంగల్ నటి “సుహాని” వరకు… 25 ఏళ్ల కూడా నిండకుండానే మనకి దూరమైన నటీమణులు వీరే.!

ప్రత్యూష నుండి దంగల్ నటి “సుహాని” వరకు… 25 ఏళ్ల కూడా నిండకుండానే మనకి దూరమైన నటీమణులు వీరే.!

by Harika

Ads

కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. నిన్నటి వరకు మనతో ఉన్న వ్యక్తి భవిష్యత్తు లో మనతోనే ఉంటారో లేదో చెప్పలేం. సినిమా సెలబ్రిటీలు మనకి వ్యక్తిగతంగా పరిచయం ఉండరు. అయినా సరే వాళ్లు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎవరో మన సొంత వాళ్ళు మనకి దూరం అయినట్టు అనిపిస్తుంది. ఎంతో మంది సినీ తారలు ఆరోగ్యం బాగా లేకపోవడం వలన, లేదా చెడు అలవాట్ల వలన లేదా ప్రమాదాల వల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వాళ్ళలో కొంతమంది యుక్తవయసులోనే తుది శ్వాస విడిచారు. అలా చిన్న వయసులో చనిపోయిన నటులలో కొంతమంది వీళ్లు.

Video Advertisement

బాలీవుడ్ బాలనటి సుహానీ భట్నాగర్ మరణంతో ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.  చిన్న వయసులోనే సుహానీ అరుదైన వ్యాధితో కన్నుమూసింది. ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ, తుది శ్వాస విడిచింది. 2016లో  బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘దంగల్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీని ప్రముఖ కుస్తీవీరుడు మహావీర్ సింగ్ ఫోగాట్ మరియు అతని కుమార్తెల లైఫ్ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాలో బాలనటిగా నటించిన సుహానీ భట్నాగర్ బబిత కుమారి పాత్రలో నటించి, మెప్పించింది. సుహానీ భట్నాగర్  19 సంవత్సరాల వయసులో కన్నుమూయడంతో బాలీవుడ్ లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

అష్టా చెమ్మా సినిమాలో నానికి చెల్లెలిగా నటించారు భార్గవి. వాళ్ల ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదు అని భార్గవి తన బాయ్ ఫ్రెండ్ కలిసి ఆ-త్మహ-త్య చేసుకుని చనిపోదామని అనుకున్నారు. అలా ఆ-త్మహ-త్య చేసుకుని 25 సంవత్సరాల వయసులో చనిపోయారు భార్గవి.

శ్రీ రాములయ్య, స్నేహం అంటే ఇదేరా, కలుసుకోవాలని సినిమాల్లో నటించిన ప్రత్యూష 20 సంవత్సరాలకే మనకి దూరమయ్యారు. ఆమె మరణం ఇప్పటికి మిస్టరీనే.

నిశ్శబ్ద్, గజినీ (హిందీ), హౌస్ ఫుల్ సినిమాల్లో నటించారు జియాఖాన్. ప్రేమించిన వ్యక్తి తో గొడవల కారణంగా మనస్తాపానికి గురైన జియాఖాన్ ఆ-త్మహ-త్య చేసుకున్నారు. 2013లో 25 ఏళ్ల వయసులోనే ముంబైలోని తన నివాసంలో శవమై కనిపించింది ఆమె.

చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దివ్యభారతి కొద్ది కాలంలోనే ఎంతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఒకరోజు పై అంతస్తులో ఉన్న తన నివాసంలో బాల్కనీ లో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి చనిపోయారు. అప్పటికి దివ్యభారతి వయసు 19 సంవత్సరాలు. ఏప్రిల్ 5, 1993న ఆమె కన్నుమూశారు.

Also Read: దంగల్ నటి “సుహానీ భట్నాగర్” పోస్ట్ మార్టంలో బయటపడ్డ నిజాలు..! 10 రోజుల క్రితమే ఆ వ్యాధి.?


End of Article

You may also like