సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినీ పరిశ్రమలో నటసార్వభౌముడుగా అగ్ర హీరోగా తన కెరీర్ ను కొనసాగించారు. అప్పట్లో ఆయన సినిమాలకు తీసుకునే పారితోషికం విషయంలోను నందమూరి తారక రామారావు టాప్ ప్లేస్ లో ఉండేవారు

Video Advertisement

ఆయన హీరోగా కొనసాగిన కాలంలో అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా పేరు గాంచారు. సినీ ఇండస్ట్రీలో మిగతా హీరోల రెమ్యునరేషన్ ఎన్టీఆర్ కన్నా తక్కువగా ఉండేది. సాధారణంగా ఒక మూవీలో హీరో హీరోయిన్లతో పాటుగా ముఖ్యమైన పాత్రలు ఎన్నో ఉంటాయి. వారిలో అత్యధిక పారితోషికం తీసుకునేది హీరోలే.
హీరోల తరువాత హీరోయిన్ల పారితోషికం, వారి తర్వాత స్థాయిలో విలన్ క్యారెక్టర్ పోషించేవారు రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే హీరోల కన్నా ఎక్కువ పారితోషికం హీరోయిన్లు తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది.  అప్పట్లో ఎన్టీఆర్ అత్యధిక పారితోషికం తీసుకునే కాలంలో ఇద్దరు హీరోయిన్లు సీనియర్ ఎన్టీఆర్ ను కన్నా ఎక్కువగా ఇద్దరు హీరోయిన్లు పారితోషికం తీసుకుని సంచలనం సృష్టించారు. అయితే ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. ఆ ఇద్దరు హీరోయిన్ల గురించి చూద్దాం..
these-heroines-remunaration-more-than-sr-ntr1. భానుమతి:
భారతీయ సి పరిశ్రమలో గొప్ప నటీమణుల్లో భానుమతి ఒకరు. ఆమె నటిగా మాత్రమే కాకుండా గాయనిగా, రచయితగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, దర్శకురాలిగా ఆమె ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. ఏడు దశాబ్దాల పాటు  ఇండస్ట్రీలో కొనసాగారు. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో హీరో ఎన్టీఆర్ కన్నా భానుమతి కొంచెం ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అలాగే తన పారితోషికాన్ని తానే నిర్ణయించేవారంట. పల్నాటి యుద్ధం చిత్రానికి ఎన్టీఆర్ పారితోషికం 5,000 కాగా, ఇదే మూవీలో నటించిన భానుమతి పారితోషికం 6000. 2. అంజలి దేవి:
అభినవ సీతమ్మగా పేరొందిన అలనాటి హీరోయిన్ అంజలీదేవి కూడా సీనియర్ ఎన్టీఆర్ కన్నా ఎక్కువగా పారితోషికం డిమాండ్ చేసేవారంట.
అంతే కాకుండా తన రెమ్యునరేషన్ తానే నిర్ణయించేవారని తెలుస్తోంది. కాగా అప్పటికే టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సావిత్రి, రాజసులోచన వంటి హీరోయిన్లు మాత్రం పారితోషికం తక్కువగా తీసుకునే వారంట.

Also Read: “ఏదో హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంది..!” అంటూ… అఖిల్ అక్కినేని “ఏజెంట్” ట్రైలర్‌పై 15 మీమ్స్..!