Ads
ఈ ఏడాది(2023) అధిక మాసం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. తెలుగు సంవత్సరం ప్రకారం శ్రావణ మాసం ఈసారి రెండు నెలలు వస్తుందని అంటున్నారు. సాధారణంగా శ్రావణం మాసం అంటే శుభకార్యాల నెలగా చూస్తారు.
Video Advertisement
అయితే ఈ ఏడాది ఆషాఢ మాసం అనంతరం వచ్చే శ్రావణ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతున్నారు. దానికి కారణం అధిక మాసం రావడం. ఈ నేపథ్యంలో అధికమాసం అని అంటే ఏమిటి? ఈ మాసంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదో ఇప్పుడు చూద్దాం..
జ్యోతిష్య శాస్త్ర పరాక్రమ కాలగణన సూర్య, చంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుణ్ణి ఆధారంగా తీసుకుని లెక్కకట్టే కాలమానాన్ని సౌరమానం అని అంటారు. చంద్రుణ్ణి ఆధారంగా తీసుకునే సంవత్సర గణనాన్ని చాంద్రమానం అని అంటారు. చాంద్రమానంలో నెల అంటే 29.53 రోజులు. దీని ప్రకారం చాంద్రమానంలో సంవత్సరానికి 354 రోజులు. సౌరమానంలో సంవత్సరానికి 365 రోజులు. దక్షిణాదిలో చాంద్రమానాన్ని అనుసరిస్తారు. ఉత్తరాదిలో సూర్యమనాన్ని అనుసరిస్తారు.
చాంద్రమానంలో ప్రతి నెల అవధిగా అమవాస్యను పరిగణిస్తే, సూర్యమనంలో పౌర్ణమిని నెల అవధిగా తీసుకుంటారు. సౌరమానానికి, చాంద్రమానానికి మధ్య ఏడాదిలో పదకొండు రోజుల తేడా ఏర్పడుతుంది. ఈ తేడా సౌరమానం, చాంద్రమానంలో ప్రతీ 4 ఏళ్లలో 31 రోజులు అవుతుంది. అలా అధిక మాసంగా ఏర్పడును. 32 నెలలకు ఒకసారి ఏర్పడే మాసాన్ని అధిక మాసం అని అంటారు.
అధిక మాసము శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన మాసం. అందుకే అధికమాసానికి పురుషోత్తమ మాసమని కూడా పేరు వచ్చినట్లు చెప్పబడినది. విష్ణుమూర్తి అధిక మాసంలో పురుషోత్తమ పేరుతో ఇంటిఇంటికి తిరుగుతుంటాడు. అందువల్ల ఈ మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించాలని, వేరే శుభకార్యాలు చేయకూడదని బ్రహ్మదేవుడు నిషేధించాడు. ఒకవేళ అలా జరుపుకుంటే విష్ణుమూర్తిని పూజించడం మాని సొంతకార్యాలు చేసుకున్న పాపానికి గురై భ్రష్టులవుతారని బ్రహ్మదేవుడు అజ్ఞాపించారని చెబుతారు. 2023లో జూలై 18 నుండి అధిక మాసం మొదలు అవుతుంది. ఈసారి అధికంగా శ్రావణమాసం రానుంది. సాధారణంగా ఆషాఢం మాసం పూర్తి అవగానే శ్రావణ మాసంలో పూజా కార్యక్రమాలు చేస్తారు. అయితే ఈసారి అసలైన శ్రావణ మాసం 2023 ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకుఅని జ్యోతిష్యు నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఇంట్లో “దుష్ట శక్తులు” ఉంటే కనిపించే సంకేతాలు ఇవే..! అవి ఏంటంటే..?
End of Article