“ఆదిపురుష్” సెన్సార్ రివ్యూ..! ఈ ఒక్కటే మైనస్ అవుతుందా..?

“ఆదిపురుష్” సెన్సార్ రివ్యూ..! ఈ ఒక్కటే మైనస్ అవుతుందా..?

by Anudeep

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన మైథాలాజికల్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందనే విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో కూడా ఆదిపురుష్ మూవి పై భారీ అంచనాలు ఉన్నాయి.

Video Advertisement

ఈ చిత్రం జూన్ 16న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు మేకర్స్. ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

aadipurush movie run time locked..

 

సెన్సార్ బోర్డు వారు యూ సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం రెండు గంటల 59 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే చిత్రానికి రాం టైం ఎక్కువగా ఉండటంతో అది మైనస్ అవుతుందేమోనని ఫాన్స్ కంగారు పడుతున్నారు.

 

aadipurush movie run time locked..

అయితే మణి రత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ చిత్రానికి కూడా దాదాపు ఇంతే రన్ టైం ఉంది. ఆ చిత్రానికి అదే మైనస్ అయ్యింది. కానీ మరికొందరు ఇటువంటి చిత్రాలకు రన్ టైం ఎక్కువగా ఉన్నా ప్రేక్షకులు పెద్దగా లెక్క చెయ్యరు అని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాకు తెలుగులో భారీ బిజినెస్ జరిగింది. యువీ సంస్థ దగ్గర ఉన్న ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌‌ను పీపుల్స్ మీడియా సంస్థ దాదాపుగా 185 కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది.

aadipurush movie run time locked..

 

ఆదిపురుష్ టీమ్ రామ భక్తుడు హనుమంతునికి అత్యంత భక్తితో కూడిన ఓ అపురూప నివాళి అర్పిస్తోంది. ఆదిపురుష్ ఆడే ప్రతి థియేటర్‌లో ఆ హనుమాన్ కోసం ఒక సీటు కేటాయిస్తారట. దీనికి సంబంధించి టీమ్ ఓ ప్రకటన చేసింది. ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్ ‘ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుందని తెలిపింది టీమ్.

Also read: ఈ కారణం వల్లే ఆదిపురుష్ టీమ్ ఇంటర్వ్యూ లకి దూరంగా ఉండాలి అని డిసైడ్ అయ్యారా..?


End of Article

You may also like