ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా ఆసక్తి కలిగిస్తున్న విషయం ఏదైనా ఉందా అంటే అది “ఆదిపురుష్‌” సినిమానే. ఇక సోషల్ మీడియాలో ఈ మూవీ పై జరిగే చర్చ గురించి అయితే చెప్పనక్కరలేదు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

రామాయణ కథను మరోసారి వెండి తెర పై చూడాలని ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌ తో  చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ తాజాగా వినూత్న నిర్ణయాన్ని ప్రకటించింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్‌ చిత్రం జూన్ 16 న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నేడు (జూన్ 6) ప్రీరిలీజ్‌ ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహిస్తోంది. ఈ వేడుక  ఈ రోజు సాయంత్రం జరగనుంది. ఈవెంట్ కోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా వస్తుండడం విశేషం.
తాజాగా ఆదిపురుష్ మేకర్స్ యువీ క్రియేషన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ ప్రకటన ఆంజనేయస్వామి భక్తులకు గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది. అది ఏమిటంటే “ఆది పురుష్‌” సినిమా ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీ ఉంచడం. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ ప్రకటనలో చెప్పారు. హనుమంతుడి కోసం సీటు ఖాళీగా ఉంచడం ఏంటనే సందేహం వస్తుంది. దానికి సమాధానం కూడా ఆ ప్రకటనలో ఇచ్చారు.

ఎక్కడ రామాయాణ పారాయణం జరిగినా, ఎక్కడ శ్రీరామ కథను ప్రదర్శించినా అక్కడ ఒక ఆసనాన్ని వేస్తుంటారు. అలా వేయడానికి కారణం శ్రీరామ కథను వీక్షించేందుకు ఆ స్థలానికి ఆంజనేయుడు వస్తాడని భక్తుల నమ్మకం. ఆ కారణంగానే మూవీ యూనిట్‌ కూడా ఆంజనేయుడి కోసం ఒక సీటును ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో తెలిపింది.

Also Read: జెనీలియా, మీరా జాస్మిన్ తో పాటు… మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఆనాటి 9 హీరోయిన్లు..!