టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ కెరీర్ వరుస హిట్స్ తో స్పీడ్ గా దూసుకుపోతోంది. రీసెంట్ గా వచ్చిన హిట్ 2 తో మరో హిట్ ను తన ఖాతా లో వేసుకున్నాడు శేష్. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది.

Video Advertisement

 

మొదట్లో సొంతం వంటి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించి ఆ తర్వాత అమెరికా కి వెళ్ళిపోయి తిరిగి వచ్చాక కర్మ వంటి ఓన్ సినిమాతో వచ్చాడు.పంజా, బాహుబలి వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు. తర్వాత కిస్ సినిమా తో పూర్తి స్థాయి హీరో గా ఎదిగి.. క్షణం తో తొలి హిట్ ని తన ఖాతా లో వేసుకున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాదు కథలు కూడా తానే రాసుకుంటూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు.

adivi sesh hicked his remunaration after hit 2 success..!!

క్షణం సినిమాతో మొదలయిన హీరో అడవి శేష్ విజయాల పరంపర .హిట్ 2 వరకు కొనసాగింది. డబల్ హ్యాట్రిక్స్ తో దూసుకు పోతున్నాడు శేష్. అప్పటి నుంచి వచ్చిన అమీ తుమీ, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 లతో హ్యాట్రిక్ హీరోల సరసన చేరిపోయారు శేష్. దీంతో ఈయన మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయారు. దీంతో నిర్మాతలు ఆయన దగ్గరకు క్యూ కడుతున్నారు. హిట్ 2 తర్వాత శేష్ తన రెమ్యూనరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది.

adivi sesh hicked his remunaration after hit 2 success..!!

సక్సెస్ పడ్డ ప్రతి సారి అతడి కెరీర్ గ్రాఫ్ తో పాటు రెమ్యూనరేషన్ గ్రాఫ్ కూడా పెరుగుతూ వెళ్తుంది. దీంతో అతడి రెమ్యూనరేషన్ పై అనేక వార్తలు వస్తున్నాయి. ఇంత‌కు ముందుకు శేష్ ఒక్కో సినిమాకు రూ. 5 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ అందుకునేవాడ‌ట‌. కానీ, ఇప్పుడు రూ. 8 -10 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ను డిమాండ్ చేసుకున్నాడ‌ట‌. ఇక శేష్‌కు ఉన్న క్రేజ్‌, మార్కెట్ దృష్ట్యా నిర్మాత‌లు సైతం అంత మొత్తం ఇచ్చేందుకు ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.