నాని నిర్మాతగా, శైలేష్ కొలను దర్శకుడిగా వచ్చిన హిట్ ఫస్ట్ కేస్ ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. విశ్వక్ సేన్‌తో చేసిన ఆ చిత్రం బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు సెకండ్ కేస్ అంటూ అడివి శేష్‌తో సినిమాను రెడీ చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 2న రాబోతోంది. దీంతో ప్రమోషన్స్ పెంచారు హిట్ టీం.

Video Advertisement

 

అయితే ఇటీవల విడుదల అయిన టీజర్ తోనే ఆడియన్స్ లో ఆసక్తి పెంచాడు దర్శకుడు. అయితే హిట్ ఫస్ట్ సినిమాలో హీరో వెంటే ఉండే అతడి ఫ్రెండే విలన్ అని క్లైమాక్స్ లో రివీల్ చేసారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రం పై కూడా జనాలు గెస్ చేయడం మొదలుపెట్టేశారు. ఆ విలన్ ఎవరై ఉంటారు.. హత్యలు ఎందుకు చేసి ఉంటారని గెస్ చేస్తున్నారు.

adivi sesh strong counter to netizen..!!

తాజాగా ఓ నెటిజన్ ఓ ట్వీట్ చేసాడు. తన ఫ్రెండ్ ఈ సినిమాలో ఓ రోల్ చేసిందని, కానిస్టేబుల్‌గా నటించిందని, అసలు విలన్ మీనాక్షి చౌదరి అని, ఆమె హీరోయిన్ కాదు విలన్ అని చెప్పుకొచ్చాడు. ఇది హీరో అడివి శేష్ కంటపడింది. దీనిపై స్పందించిన అడివి శేష్ ‘నన్ను నమ్మండి బ్రో.. ‘ అంటూ కౌంటర్ వేశాడు. ప్రస్తుతం అడివి శేష్ కౌంటర్ ఇచ్చిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇది మేం కూడా ఊహించాం.. ఫస్ట్ కేస్‌లో ఫ్రెండ్, ఇప్పుడు లవర్ విలన్ అంటూ ఇంకొంత మంది నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.

adivi sesh strong counter to netizen..!!

క్షణం నుంచి ‘మేజర్’ వరకు వరుసగా ఐదు హిట్ లని తన ఖాతాలో వేసుకున్న అడివి శేష్ ఈ మూవీలో హీరోగా నటించాడు. ‘హిట్’ మూవీకి ఫ్రాంచైజీగా నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ‘ఖిలాడీ’ ఫేమ్ మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.