Ads
సినిమా నేపథ్యంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఇప్పుడు పవర్ స్టార్ గా ఎదిగారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా లెక్కచేయకుండా ప్రచార కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ ని చూడడానికి ఎన్నో లక్షల మంది ప్రజలు వస్తున్నారు. మరొక పక్క పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్స్ అన్నిటికీ బ్రేక్ పడింది. ఎన్నికలు పూర్తవగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లో పాల్గొంటారు.
Video Advertisement
పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో, ఒక సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అయితే, మరొకటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాబోతున్న హరిహర వీరమల్లు. ఇంకొకటి సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఓజీ. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేకపోవడంతో ఈ సినిమా షూటింగ్స్ కి బ్రేక్ పడింది. తర్వాత మళ్లీ మొదలు అవుతాయి. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 30వ తేదీ, 2013 లో అన్నా లెజ్నెవాని పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తీన్ మార్ సినిమాలో అన్నా లెజ్నెవా నటించారు. అప్పుడే వాళ్ళిద్దరూ ప్రేమలో పడినట్టు సమాచారం.
ఇప్పుడు వీళ్ళిద్దరికీ మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కొడుకు, పోలేనా అంజనా పవనోవా అనే కూతురు ఉన్నారు. అన్నా లెజ్నెవా అప్పుడప్పుడు బయట కనిపిస్తూ ఉంటారు. ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుకల్లో కనిపించారు. అన్నా లెజ్నెవా 1980 లో పుట్టారు. ఇప్పుడు ఆమె వయసు 44 సంవత్సరాలు. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీ, 1968 లో పుట్టారు. పవన్ కళ్యాణ్ వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. వీళ్ళిద్దరికీ మధ్య 11 సంవత్సరాల వయసు తేడా ఉంది. అన్నా లెజ్నెవా ప్రస్తుతం వ్యాపారవేత్తగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. దుబాయ్ లాంటి దేశాల్లో హోటల్స్ ఉన్నాయి. వాటి బాధ్యతలు అన్నీ కూడా అన్నా లెజ్నెవా చూసుకుంటున్నారు.
ALSO READ : హీరోయిన్ నగ్మా గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా మారిపోయారో చూసారా..?
End of Article