“ఏజెంట్” సెన్సార్ టాక్..! సినిమా హిట్టా..? ఫట్టా..?

“ఏజెంట్” సెన్సార్ టాక్..! సినిమా హిట్టా..? ఫట్టా..?

by kavitha

Ads

యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన  తాజా చిత్రం ‘ఏజెంట్’ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. రీసెంట్ గా విడుదల అయిన ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా  రిలీజ్ అయిన నిమిషాల్లోనే ఈ ట్రైలర్ వైరల్ గా మారింది.

Video Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోలు కూడా ఈ ట్రైలర్ కు రివ్యూ ఇచ్చారు. అయితే ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి  U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈ విషయన్ని ప్రొడ్యూసర్స్ అధికారికంగా ధృవీకరించారు. అక్కినేని అఖిల్ ప్రస్తుతం భారీ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అఖిల్ ఈ మూవీకి ముందు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో డీసెంట్ హిట్ నుఅందుకున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన  స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ కోసం అఖిల్ చాలా కష్టపడ్డారు. యాక్షన్, బాడీ, డాన్స్ ఇలా అన్ని రకాలుగా అఖిల్ చాలా శ్రమించారని తెలిస్తోంది.
రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ఈ మూవీ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ అఖిల్ విభిన్నంగా నిర్వహిస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అఖిల్  171 అడుగుల ఎత్తు నుండి జంప్ చేసి ఆడియెన్స్ ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి మరో అప్డేట్ వచ్చింది. తాజాగా ‘ఏజెంట్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుందని మేకర్స్ తెలిపారు.
సెన్సార్ బోర్డు ‘ఏజెంట్’ సినిమాకి U/A సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఈ మూవీలో భారీ యాక్షన్ మరియు వయలెన్స్ ఉండటం వల్ల U/A సర్టిఫికెట్ ను ఇచ్చారు. అంటే కుటుంబంతో కలిసి ఈ మూవీ చూడవచ్చు. 12 సంవత్సరాల లోపు పిల్లల తమ పేరెంట్స్ తో కలిసి చూడొచ్చు. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 36 నిమిషాలు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు ఇది ఫర్ఫెక్ట్ రన్ టైమ్.
ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని మూవీ యూనిట్ భావిస్తున్నారు. ఈ మూవీకి వక్కంతం వంశీ కథను అందించారు. మలయాళ మెగా స్టార్ మమ్ముుట్టీ ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించారు. ఏప్రిల్ 28న తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీలలోనూ విడుదల చేయబోతున్నారు.

Also Read: “విరూపాక్ష” సినిమాలో హీరోయిన్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన… అమ్మాయి ఎవరో తెలుసా..?


End of Article

You may also like