అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్’, ‘సురేందర్ 2 సినిమా’ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ నమోదు చేశాయి.

Video Advertisement

 

 

80 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఈ సినిమాని తీస్తే మొదటి రోజు వచ్చిన వసూళ్లు కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ మాత్రమే. శనివారం మరియు ఆదివారం అయినా డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటుంది అని భావిస్తే ఆ రెండు రోజులు ఇంకా దారుణంగా వసూలు చేసింది.

agent movie unbelievable share in 4th day..!!

నైజాం లో మొదటి నాలుగు రోజులకు కలిపి కేవలం కోటి 64 లక్షల రూపాయిలు మాత్రమే వసూలు చేసింది. ఇలాంటి యాక్షన్ సినిమాలకు మొదటి రోజే ఈ ప్రాంతం లో 5 కోట్ల రూపాయిల వరకు షేర్ వస్తుంది. కానీ ఈ చిత్రానికి నాలుగు రోజులకు కలిపి అందులో సగం వసూళ్లు కూడా రాలేదు.

agent movie unbelievable share in 4th day..!!

ఆ తర్వాత సీడెడ్ లో 81 లక్షలు, ఉత్తరాంధ్ర లో 78 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 44 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 39 లక్షలు, గుంటూరు లో 66 లక్షలు , కృష్ణ జిల్లాలో 33 లక్షలు , నెల్లూరు లో 22 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల 27 లక్షలు రాగ, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 6 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.

agent movie unbelievable share in 4th day..!!

క్రేజీ కాంబోలో వచ్చిన ‘ఏజెంట్’ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ప్రస్తుతం కమిషన్ బేసిస్ మీదనే నడుస్తుంది, రెంటల్ బేసిస్ మీద నడుస్తున్న థియేటర్స్ లో జీరో షేర్స్ వస్తున్నాయి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.6.36 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.28.64 కోట్ల షేర్ ను రాబట్టాలి.