శుక్రవారం (ఏప్రిల్ 28 ) నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి చారిత్రక నేపద్యంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 2 కాగా, మరొకటి టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన యాక్షన్ మూవీ ఏజెంట్.

Video Advertisement

ఏజెంట్ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటించగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా కీలక పాత్రలలో నటించారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్, హీరో అఖిల్ లుక్, మమ్ముట్టి నటిస్తుండడంతో ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి.
ఇటీవల రిలీజ్ అయిన మూవీ టీజర్, సాంగ్స్. ట్రైలర్ తో మూవీ పై అంచనాలు పెరిగాయి. ఇక లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ తారగణం, చోళ చరిత్ర పై తీసిన సినిమా అవడంతో ఈ చిత్రం పై అందరికి ఆసక్తి పెరిగింది. అయితే ఈ రెండు చిత్రాలు మొదటి రోజు ఎంత వసూల్ చేసాయో ఇప్పుడు చూద్దాం..
ఏజెంట్:
ఈ చిత్రం పై భారీగా అంచనాలు ఉన్నప్పటికి, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగా జరగయని తెలుస్తోంది. ఈ మూవీకి  ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ రాలేదని చెప్పవచ్చు. అయితే ఈ మూవీకి మాస్ సెంటర్స్ లో కలెక్షన్స్ బాగానే వచ్చాయని సమాచారం. అది కాక బాక్సాఫీస్ వద్ద పొన్నియన్ సెల్వన్ 2 కూడా పోటీ పడింది. అయినప్పటికి , ఈ చిత్రం మొదటి రోజు రూ.7 కోట్లు వసూలు చేసింది.
పొన్నియన్ సెల్వన్ 2:
గత ఏడాది ఈ చిత్రం మొదటి భాగం రిలీజ్ అయింది. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రెండో పార్ట్ శుక్రవారం విడుదల అయ్యింది. ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ మొదట స్లో గా ఉన్నా, విడుదల అయ్యేనాటికి టాక్ పాజిటివ్ గా రావడంతో షో షో కి వసూళ్లు పెంచుకుంటూ వెళ్ళింది. ఇక ఈ చిత్రం ఓవరాల్ గా దేశ వ్యాప్తంగా రూ.32 కోట్లు సాధించి దళపతి విజయ్ వరిస్ సినిమాని బీట్ చేసింది.

Also Read:“గంగోత్రి” తో పాటు… బలగం హీరోయిన్ “కావ్య కళ్యాణ్ రామ్” చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన 9 సినిమాలు..!