Ads
శ్రీరామ చంద్రుడు చాలా అందంగా ఉండేవారని రామాయణంలో కవులు వర్ణించటం చదివే ఉంటారు. రాముని రూపం చూసినవారు మైమరిచి అలాగే చూస్తుండిపోయేవారట. రామ చంద్రున్ని ఎంత సేపు చూసిన తనివి తీరటం లేదని దశరధుడు మైమరచి అలాగే చూస్తూ ఉండేవారట.
Video Advertisement
శ్రీమన్నారాయణ అవతారం అయిన రామ చంద్రుడి ముగ్ధ మోహన రూపం గురించి ఎన్నో విధాలుగా కవులు అద్భుతంగా వర్ణించారు. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు యొక్క సమ్మోహన రూపం గురించి వర్ణించారు. మహారాజు కుమారుడే అయినప్పటికి కొంచెం కూడా గర్వం లేకుండా ఒక తండ్రికి కుమారుడు ఎలా ఉండాలో, అన్నగా, భర్తగా, ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ఇలా ఎన్నో విషయాలలో రాముడు అందరికి ఆదదర్శంగా నిలిచాడు. విలువలతో కూడిన జీవితానికి శ్రీరామచంద్రుడు నేటికి ఈ సమాజానికి ఆదర్శంగా ఉన్నాడు.
రామయ్యను జగదభిరాముడు, నీలమేఘశ్యాముడు సుగుణాభి రాముడు, సీతామనోభి రాముడు అంటూ పిలుచుకుని భక్తులు పరవశించిపోతారు. శ్రీరాముడిని ఎంత అందంగా ఉండేవాడో ఇప్పటివరకు కవులు వర్ణించడం, ఊహాజనిత చిత్రాలలో, సినిమాలలో చూసి ఉంటాం. అయితే రాముడు 21 ఏళ్ల వయసులో నిజంగా ఎలా ఉండేవారో అనే ఆలోచన చాలా మందికి వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ఆలోచనకు రూపాన్ని ఇస్తూ 21 ఏళ్ల వయస్సులో రాముడి నవ యవ్వన రూపాన్ని రూపొందించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరించిన రాముడి చిత్రం ముగ్ధమనోహరంగా ఉంది. AI తయారు చేసిన రాముడి 2 చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఒకదానిలో రాముడు సాధారణంగా కనిపించగా, రెండవ ఫొటోలో చిరునవ్వుతో ఉన్నారు. కాషాయరంగు దుస్తులతో ఉన్న శ్రీ రాముడి ఫోటో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ ఫోటోల పై నెటిజెన్లు స్పందిస్తున్నారు. వారిలో ఒకరు రాముడి అంత అందంగా మరొకరు పుట్టలేదని కామెంట్ చేశారు.
వాల్మీకి రామాయణంలో శ్రీరాముని రూపం..
శ్రీరామ చంద్రుడి ముఖం చంద్రుని వలె కాంతివంతంగా, సున్నితంగా, అందంగా ఉండేదని వాల్మీకి తన రామాయణంలో వివరించారు. రాముడి కళ్లు కమలం వలె అందంగా, పెద్దవిగా ఉండేవని, రాముడి ముక్కు ఆయన ముఖం వలె పొడవుగా ఉంటుందని వర్ణించాడు. రాముని పెదాలు సూర్యుని రంగుల ఎర్రగా ఉంటుందని, అలాగే రెండు పెదవులు సమానంగా ఉన్నాయని చెప్పారు.
वाल्मीकि रामायण, रामचरितमानस सहित तमाम ग्रंथों में दिये विवरणों के अनुसार, भगवान श्री रामचंद्र जी की AI जनरेटेड फोटो, जब वो 21 वर्ष के थे…
No one ever born on planet earth as handsome as Bhagwan Shri Ram.
जयश्रीराम🚩#SupremeGod pic.twitter.com/heEChvVk40
— Dr. Jitendra Nagar (@NagarJitendra) April 10, 2023
Also Read: “గంగమ్మ తల్లి జాతర” అంటే ఏంటి..? ఆ జాతరలో భక్తులు ఇలా ఎందుకు వేషాలు వేస్తుంటారు..?
End of Article