“గంగమ్మ తల్లి జాతర” అంటే ఏంటి..? ఆ జాతరలో భక్తులు ఇలా ఎందుకు వేషాలు వేస్తుంటారు..?

“గంగమ్మ తల్లి జాతర” అంటే ఏంటి..? ఆ జాతరలో భక్తులు ఇలా ఎందుకు వేషాలు వేస్తుంటారు..?

by kavitha

Ads

రాయలసీమలో జరిగే అతి పెద్ద జాతర తిరుపతి గంగమ్మ జాతర. ప్రతి ఏడాది చైత్రమాసం ఆఖరి వారంలో ఈ తాతయ్యగుంట గంగమ్మ జాతర మొదలవుతుంది. 9 రోజులు జరిగే ఈ జాతరలో భక్తులు రోజుకో వేషంలో గంగమ్మను దర్శించుకున్నారు. ఈ జాతర చిత్తూరు పరిసర ప్రాంతాలలో జీవించే ప్రజల జీవన విధానాలను, ఆచారాలు ప్రతిబింబిస్తుంది.

Video Advertisement

బైరాగి వేషంతో మొదలయ్యే ఈ జాతరలో వేసే ప్రతి వేషంలో ప్రత్యేకత, ఆధ్యాత్మిక, అంతర్యం నిగూఢమై ఉంటుంది. పాలేగాడిని వేటాడి అంతమోదించడానికి అమ్మవారు వేసిన వేషాలను ఈ జాతర రోజుల్లో భక్తులు అనుసరించడం ద్వారా అమ్మవారు సంతృప్తి చెందుతుందని, తద్వారా తమ కోరికలు తీర్చుతుందన్నది ఇక్కడి వారి విశ్వాసం. జాతరలో మొదటి రోజు భక్తులు బైరాగి వేషం వేసుకొని, శరీరానికి నాముకొమ్ము రాసుకుని, వేప కొమ్మలు పట్టుకొని, బూతులు తిట్టుకుంటూ గుడికి వెళ్ళి, అమ్మవారి దర్శనం చేసుకుంటారు.Tirumala-Tirupati-Gangamma-Jatara1 - Copy తరువాత రోజు బండ వేషం, 4వ రోజు తోటి వేషం వేసుకుంటారు. తోటి వేషంలో శరీరానికి మసి బొగ్గు పూసుకుని, తెల్లని బొట్టు, చుక్కలు పెట్టుకుంటారు. చిన్నపిల్లలు కూడా మీసాలను ధరిస్తారు. ఐదో రోజు కైకాల కులస్థులు వారి వంశ పారంపర్యంగా వస్తున్న దొర వేషాన్ని వేసుకుంటారు. ఆరవ రోజున మాతంగి వేషాలు వేసుకుంటారు. పురుషులు కూడా స్త్రీల వలె అలంకరించుకుని అమ్మవారిని దర్శిస్తారు.
Tirumala-Tirupati-Gangamma-Jatara4సున్నపు కుండల వేషాన్నికైకాల కులస్థులు వేసుకొని గంగమ్మకు ప్రతిరూపంగా గ్రామంలోని వీధులలో తిరుగుతూ భక్తులతో హారతులు అందుకుంటారు. ఆఖరి రోజు గంగమ్మ విశ్వరూప దర్శనం అవుతుంది. తరువాత పేరంటాళ్ల వేషం వేసుకున్న వంశస్థుడు వచ్చి అమ్మవారి చెంపను కత్తితో నరకడంతో ఈ జాతర సమాప్తం అవుతుంది. అమ్మవారి విశ్వరూపాన్ని బంకమట్టితో నిర్మిస్తారు. జాతర ముగిసిన తరువాత ఆ మట్టిని తీసుకోవడానికి భక్తులు పోటీపడతారు. ఈ మట్టిని తీసుకోవడం ద్వారా గృహబాధలు, దీర్ఘకాలిక రోగాలు, దేహబాధలు, భయం పోతుందని నమ్ముతారు.
Tirumala-Tirupati-Gangamma-Jataraతిరుపతి గంగమ్మ జాతర వెనుక ఉన్న కథ:
పూర్వకాలంలో పాలెగాళ్ళు చిత్తూరును పాలించేవారు. అయితే పాలెగాళ్ల దురాగతాలు, అరాచకాలు రోజు రోజుకు  పెరిగి పోతుండడంతో ఆ అమ్మవారు గంగమ్మగా అవతరించినట్టుగా అక్కడి స్థల పురాణం చెబుతోంది. అయితే పాలెగాడు గంగమ్మ తల్లికి భయపడి కనపించకుండా దాక్కొని ఉండేవాడు. పాలెగాడిని బయటకి రప్పించడానికి రోజుకో వేషంతో బూతులు తిడుతూ గంగమ్మ తల్లి వెతికేది.
Tirumala-Tirupati-Gangamma-Jatara3కానీ అతడు బయటకు వచ్చేవాడు కాదు. చివరికి గంగమ్మ దొరవేషంలో వచ్చి పిలవగానే అతని దొర వచ్చాడని బయటకు రావడంతో గంగమ్మ అతనిని సంహరించి ప్రజలను అతని బారి నుండి రక్షిస్తుంది. ఆనాటి నుండి చైత్రమాసం ఆఖరి వారంలో 9 రోజుల పాటు రోజుకో వేషంతో భక్తులు వేషాలు వేసుకొని బూతులు తిడుతూ ఉంటారు. వైభవంగా ఉత్సవాలు చేస్తారు. తొలిరోజు బైరాగి వేషాన్ని భక్తులు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. పొంగలి, అంబలి నైవేద్యంగా సమర్పిస్తారు. Tirumala-Tirupati-Gangamma-Jatara2Also Read: ద్రౌపది తన ఐదుగురు భర్తలతో ఎలా కాపురం చేసేదో తెలుసా..? ద్రౌపది గురించి ఎవరికీ తెలియని విషయాలు..!


End of Article

You may also like