ప్రభాస్‌ ప్రస్తుతం మహానటి ఫేమ్‌ నాగ్ అశ్విన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ‘ప్రాజెక్ట్‌ కే’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌తో పాటు దీపికా పదుకొణె నటిస్తుండడం విశేషం.

Video Advertisement

ఇక ఈ సినిమా కథ కథెంటీ అన్న దానిపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. టైమ్‌ ట్రావెల్‌ కథ అని ఇప్పటికే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ ఇప్పటి వరకు కథకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. అలాగే మహాభారతంలోని ఒక చాప్టర్‌ ఆధారంగా ఈ సినిమా కథ తెరకెక్కిస్తున్నారని నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి.

what is the story of prabhas project k..!! అయితే ఇప్పటివరకు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా విభిన్నం గా ఉన్నాయి. దీన్ని బట్టి ఇది భవిష్యత్ కాలానికి సంబంధించిన కథ అని తెలుస్తోంది. తన తండ్రిని వెతకడం కోసం ప్రభాస్ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు.. అతడికి దీపికా, అమితాబ్ బచ్చన్ ఎలా సహాయం చేసారు అన్నదే ఈ సినిమా కథ అని నెట్టింట పలు కథనాలు వస్తున్నాయి. పూర్తి టెక్నాలజీ ఆధారిత చిత్రం అని తెలుస్తోంది. దీన్ని బట్టి కొన్ని ఊహాజనిత ఫోటోలని కూడా నెట్టింట మనం చూడొచ్చు.

what is the story of prabhas project k..!!

మా డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఆ పోస్టర్ లో భూమిపైన ఉంది. ఈ చేతికి సంబంధించిన బాడీ కనిపించడం లేదు. కానీ, ఆ చేయి చాలా చాలా పెద్దది. దాని ముందు ముగ్గురు మనుషులు గన్ తో నిలబడి ఉన్నారు. చాలా మిస్టీరియస్ గా ఉన్న ఈ పోస్టర్ ఏం చెబుతుందో అర్థం కావట్లేదు. The World is Waiting అని క్యాప్షన్ పెట్టారు పోస్టర్ లో. అంటే ఈ స్పేస్ సూట్స్ లాంటివి వేసుకున్న మనుషులది ఏ గ్రహం. లేదా భారీ మనిషి వేరే గ్రహం నుంచి వచ్చిన వ్యక్తా. ప్రశ్నలు చాలా చాలానే ఉన్నాయి. ఇది కచ్చితంగా సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అనేది అర్థం అవుతోంది.

what is the story of prabhas project k..!!

అలాగే అమితాబ్ బచ్చన్ బర్త్ డే సందర్భంగా లెజెండ్స్ ఆర్ ఇమ్మోర్టల్ అని ఓ చేతి పోస్టర్ రిలీజ్ చేశారు. అదే నెలలో అంటే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా హీరోస్ ఆర్ నాట్ బార్న్ దే రైజ్ అంటూ మరో చేతిని పోస్టర్ గా రిలీజ్ చేశారు. దీపికా పదుకోన్ బర్త్ డే రోజు… హిప్పీ క్రాఫ్ ఫేస్ మీద డార్క్ షేడ్, దుమ్ముతో కప్పుకుపోయి ఉన్న దీపికా ఫోటోను రిలీజ్ చేశారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే ఈ చిత్రాన్ని చూసి అప్పుడే తెలుసుకోవాలి కథ ఏంటి అనేది.

what is the story of prabhas project k..!!

గతేడాది రీ ఇన్వెంటింగ్ ద వీల్ అని వైజయంతీ మూవీస్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. భారీగా కనిపిస్తున్న టైర్ అది. అంతకు ముందు తమ సినిమా కోసం భారీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈవీ వెహికల్స్ కావాలని నాగ్ అశ్విన్ పోస్ట్ చేస్తే..ఆనంద్ మహీంద్రా స్పందించారు. సో అఫీషియల్ గా ప్రాజెక్ట్ కే టెక్నాలజీ విషయంలో మహీంద్రా సపోర్ట్ తీసుకుంటోంది.

what is the story of prabhas project k..!!

మహానటి హిట్ తర్వాత ఇన్నేళ్ల పాటు ప్రాజెక్ట్ కే పైనే నాగ్ అశ్విన్ పనిచేస్తున్నారు. అది కూడా వైజయంతీ మూవీస్ తమ 50 ఏళ్ల సినీ నిర్మాణ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేస్తున్న ఈ సినిమా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.