ఐశ్వర్య రాజేష్ కు ఎంత టాలెంట్ ఉన్నా సోలో హీరోయిన్ గా థియేట్రికల్ హిట్టు కొట్టిన దాఖలాలు పెద్దగా లేవు. అయితే ఓటిటిలో మాత్రం తనకు మంచి సక్సెస్ లున్నాయి. అయిదు నెలల కాలంలో అయిదు సినిమాలు రిలీజ్ కావడమంటే మాములు విషయం కాదు. ఇక ఇప్పుడు తాజాగా ఫర్హానా మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఐశ్వర్య రాజేష్. ఇప్పుడు ఆ మూవీ ఎలా ఉందో చూద్దాం..

Video Advertisement

  • చిత్రం : ఫర్హానా
  • నటీనటులు : ఐశ్వర్య రాజేష్, సెల్వరాఘవన్, ఐశ్వర్య దత్తా, జితన్ రమేష్, అనుమోల్ తదితరులు
  • నిర్మాత : ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
  • దర్శకత్వం : నెల్సన్ వెంకటేశన్
  • సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
  • విడుదల తేదీ : మే 12, 2023fARHANA MOVIE-STORY-REVIEW-RATING..!!

స్టోరీ :

ఫర్హానా (ఐశ్వర్య రాజేష్‌) వివాహిత. ఆమె భర్త కరీమ్‌ (జిత్తన్‌ రమేష్‌) కి ఓ చెప్పుల షాపు ఉంటుంది. ఆమె తండ్రి కూడా అదే షాపులో క్యాషియర్‌గా కూర్చుంటాడు. కొన్ని కారణాల వల్ల వారి చెప్పుల వ్యాపారం సరిగా నడవదు. దానికి తోడు రోజురోజుకూ ఇల్లు గడవడమే గగనమవుతుంటుంది. దాంతో ఉద్యోగం చేయాలనికుంటుంది ఫర్హానా. ఆమె స్నేహితురాలు నిత్య సాయంతో ఉద్యోగం సంపాదిస్తుంది. కాల్‌ సెంటర్‌ లో ఉద్యోగం లో చేరుతుంది.

fARHANA MOVIE-STORY-REVIEW-RATING..!!

అక్కడ ఆమెకు ఎ.దయాకర్‌ పరిచయమవుతాడు. అతని స్వరంతో పరిచయం పెరుగుతుంది. మనసులోని మాటలన్నీ అతనికి చెప్పేస్తుంది. కానీ ఒకానొక సందర్భంలో ఫర్హానా కొలీగ్‌ హత్యకు గురవుతుంది. అప్పటి నుంచి పరిస్థితులన్నీ తారుమారవుతాయి. ఇంతకీ ఆ హత్యకూ, ఫర్హానా, దయాకర్‌ మధ్య దూరానికీ కారణం ఏంటి? ఈషా ఎవరు? అసలేం జరిగింది? తనను చుట్టుముట్టిన సమస్యల నుంచి ఫర్హానా ఎలా బయటపడింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

రివ్యూ:

దర్శకుడు నెల్సన్‌ ఎంపిక చేసుకున్న కథ బావుంది. ఫోన్‌ ట్రాప్‌ గురించి గతంలోనూ చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఫర్హానాలో ప్రస్తావించిన ఫ్రెండ్లీ చాట్‌ మీద తెలుగులో సినిమాలు ఈ మధ్యకాలంలో కనిపించలేదు. వృత్తిని వృత్తిగానే చూడాలి అనేది చూపించారు. అవసరాల కోసం గీత దాటితే సమస్యల వలయం తప్పదని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. కుటుంబ సభ్యులను కాదని, బాగా మాట్లాడుతున్నారని బయటి వారితో అన్నీ చెప్పుకోవడం తగదనే సందేశాన్నిచ్చారు.

fARHANA MOVIE-STORY-REVIEW-RATING..!!

సొసైటీలో నానాటికీ పెరుగుతున్న యాప్‌లు, వాటి వల్ల జరిగే అనర్థాలు వంటి వాటిని ప్రస్తావించిన తీరు బావుంది. ఇక ఫర్హానా కేరక్టర్‌కు ఐశ్వర్య రాజేష్‌ ప్రాణం పోశారు. దిగువ మధ్యతరగతి ఇల్లాలిగా మెప్పించారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు చుట్టూ సమాజాన్ని చూడటం వల్ల కలిగిన కోరికలు… వీటి మధ్య సతమతమైన మహిళగా పర్ఫెక్ట్‌గా కనిపించారు ఐశ్వర్య. మిగతా నటీనటులు పరిధిమేర నటించారు.

విలన్‌ని చూపించకుండా చివరిదాకా దాచిన తీరు బావుంది. అతన్ని చూపించిన ప్రతిసారీ కెమెరామేన్‌ పెట్టిన యాంగిల్స్ ని మెచ్చుకోవాల్సిందే. ఫర్హానా మూవీకి హైలైట్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌. ప్రతి సీన్‌ని బీజీఎంతో ఎలివేట్‌ చేశారు జస్టిన్‌ ప్రభాకరన్‌.

ప్లస్ పాయింట్స్ :

  • స్టోరీ పాయింట్
  • ఐశ్వర్య రాజేష్
  • డైలాగ్స్

 

మైనస్ పాయింట్స్ :

  • ప్రీ క్లైమాక్స్
  • స్క్రీన్ ప్లే

fARHANA MOVIE-STORY-REVIEW-RATING..!!

రేటింగ్ :

3 / 5

టాగ్ లైన్ :

కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంగేజింగ్ స్టోరీ కలగలిపిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫర్హానా. ఈ వీకెండ్ కి మంచి ఆప్షన్..

watch teaser :