రాజేంద్ర ప్రసాద్ “రాంబంటు”లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు టాప్ హీరోయిన్ తెలుసా.?

రాజేంద్ర ప్రసాద్ “రాంబంటు”లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు టాప్ హీరోయిన్ తెలుసా.?

by Anudeep

Ads

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తో తెలుగు నాట బాగా ఫేమస్ అయిపోయిన అమ్మాయి ఐశ్వర్య రాజేష్. కౌసల్య కృష్ణమూర్తి సినిమా తో ఐశ్వర్య తెలుగు వారికీ దగ్గరైంది. తెలుగు అమ్మాయే ఐన ఐశ్వర్య పుట్టి పెరిగింది అంతా చెన్నై లోనే.. తమిళనాట ఆమె దాదాపు పాతిక సినిమా లు వరకు నటించింది. ఇవి కాక, ఒక హిందీ సినిమా తో పాటు రెండు మలయాళం సినిమాలు కూడా చేసిందట.

Video Advertisement

 

ఐశ్వర్య చెన్నై లో పుట్టి పెరిగినా, తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. ఐశ్వర్య తండ్రి రాజేష్ కూడా తెలుగు నాట మంచి నటుడే. తెలుగు లో దాదాపు 45 సినిమాలలో రాజేష్ నటించాడు. రెండు జడల సీత, మల్లెమొగ్గ లాంటి సినిమాల్లో నటించాడు. ఐశ్వర్య అత్త శ్రీ లక్ష్మి మనకు కొత్త కాదు. ఒకప్పటి లేడీ కమెడియన్ అని అడగ్గానే మనకి ముందు గుర్తుకు వచ్చేది శ్రీలక్ష్మి గారే. ఐశ్వర్య తాతగారు అమరనాథ్ కూడా ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చాలా పాపులర్. ఇలా ఐశ్వర్య రాజేష్ ఫామిలీ లో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అలా.. ఐశ్వర్య కు కూడా చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి కలిగింది.

2 iswarya world famous lover

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తో ఐశ్వర్య ఎక్కువ గా పాపులర్ అయినప్పటికీ, ఐశ్వర్య చిన్నప్పుడే బాల నటి గా నటించింది. రాజేంద్ర ప్రసాద్ సినిమా “రాంబంటు” లో ఐశ్వర్య బాలనటి గా నటించింది. ఆ సినిమా లో ఓ సీన్ ఉండేదట. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఐశ్వర్య కు ముద్దు పెట్టె సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయం లో, రాజేంద్ర ప్రసాద్ ముద్దు పెట్టగానే ఐశ్వర్య దానిని తుడిచేసుకునేదట. ఇలా దాదాపు పదిహేనుసార్లు ఆయన ముద్దు పెట్టడం, ఈమె తుడిచేసుకోవడం.. ఎన్ని సార్లు చేసినా షాట్ ఓకే అవలేదట. దీనితో, రాజేంద్రప్రసాద్ సరదాగా.. “ఏంటి పిల్లా నన్ను ముద్దుపెట్టుకుని తుడిచేస్తున్నావ్” అంటూ ఆటపట్టించారట. ఎప్పటికో గాని ఆ షాట్ ఒకే ఇవ్వలేదు. కానీ, ఈరోజుకు కూడా ఐశ్వర్య తండ్రి రాజేష్ కు, రాజేంద్ర ప్రసాద్ కు మధ్య ఆ స్నేహం అలానే ఉంది.

 

అప్పుడెప్పుడో రాంబంటు సినిమా లో రాజేంద్ర ప్రసాద్ తో నటించిన ఐశ్వర్య రాజేష్.. మళ్ళీ ఇన్నేళ్లకు రాజేంద్ర ప్రసాద్ తో కౌసల్య కృష్ణమూర్తి సినిమా లో నటించింది. ఐశ్వర్య కు తెలుగు నాట మంచి ఫ్యామిలి బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా చాలా కాలం తెలుగు సినిమాల్లో నటించలేదు. తమిళ సినిమాలు నటిస్తూ వచ్చింది. తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలను మాత్రమే ఐశ్వర్య ఒప్పుకుంటోంది. అందుకే ఆమె తెలుగునాట సినిమా లు చేయడానికి చాలా కాలం పట్టిందట.


End of Article

You may also like