తమిళ హీరో అజిత్ నటిస్తున్న సినిమా ‘తునివు’. అజిత్‌తో ‘వలిమై’ తీసిన హెచ్.వినోద్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా ‘తెగింపు’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్రం లో నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అజిత్ కు తెలుగు లో కూడా మంచి పాపులారిటీ ఉండటం తో ఇక్కడ కూడా బజ్ ఏర్పడింది. సంక్రాంతి సందర్బంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.

Video Advertisement

ఈ సినిమాకు తెలుగులో మూడు కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్ నడుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. తునివులో మంజు వారియర్ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక రివ్యూ బయటకు వచ్చింది. . దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు తునివు రివ్యూ చెప్పేశారు.

umair sandhu tweets on ajith's tegimpu movie..!!

సోషల్ మీడియాలో ఉమైర్ సంధు ఈ సినిమా గురించి వరుస ట్వీట్స్ చేసారు. ” తునివు సినిమాలో అజిత్ చాలా స్టైలిష్ గా నటించారు. యాక్షన్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. అజిత్ స్టైలిష్ స్వాగ్ కి, మంజు వారియర్ యాక్షన్స్ సీన్స్ తోడయ్యాయి. ఒక తమిళ్ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించారు. ఈ సంక్రాంతికి ఇది సరైన ఛాయస్.” అని ఉమైర్ సందు తన ఖాతాలో ట్వీట్స్ చేసారు.

umair sandhu tweets on ajith's tegimpu movie..!!

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ వేగం చేసింది టీం. అలాగే ఇప్పటి వరకు అజిత్, విజయ్ సినిమాలు దాదాపు పది సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ అయ్యాయి. ఈ యేడాది కూడా అజిత్ ‘తునివు’, విజయ్ ‘వారిసు’ సినిమాలు ఒకేసారి విడుదల అవ్వబోతున్నాయి. ఇటు తెలుగులో కూడా మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నారు ఈ ఇద్దరు హీరోలు. దీంతో ఈ రెండు సినిమాలు పోటా పోటీగా ప్రమోషన్స్ ను సాగిస్తున్నాయి.